సక్సెస్‌కి సూత్రం లేదు | Rakul Preet Singh on NTR biopic | Sakshi
Sakshi News home page

సక్సెస్‌కి సూత్రం లేదు

Published Mon, Nov 19 2018 2:57 AM | Last Updated on Mon, Nov 19 2018 2:57 AM

Rakul Preet Singh on NTR biopic - Sakshi

రకుల్‌ ప్రీత్‌సింగ్‌

‘‘ఇలా చేస్తే విజయం సాధిస్తారు. సక్సెస్‌కి షార్ట్‌కట్‌ ఇదీ.. అంటుంటారు కొందరు. కానీ అవన్నీ అబద్ధాలు. అసలు సక్సెస్‌కి సూత్రమే లేదు. మనం చేసే పనిలో వంద శాతం ఇవ్వడమే సక్సెస్‌కి ఫార్ములా’’ అంటున్నారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఈ విషయం గురించి రకుల్‌ మాట్లాడుతూ – ‘‘విజయం సాధించాలంటే నిన్ను నువ్వు నమ్మడం ముఖ్యం. నువ్వు మనస్ఫూర్తిగా నీ పని చేస్తున్నావా? లేదా? అన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది.

అన్నీ నేర్చేసుకున్నాం అని ఎప్పుడూ భావించకూడదు. ఎంత నేర్చుకున్నా ఇంకా చాలా మిగిలే ఉంటుంది.  నువ్వు చేస్తున్న పనిని నిజాయతీతో కష్టపడి చేస్తే సక్సెస్‌ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది’’ అని పేర్కొన్నారు. సినిమాల విష యానికి వస్తే రకుల్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో, కోలీవుడ్‌లో రెండేసి సినిమాలు చేస్తున్నారు. తెలుగులో ‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌లో శ్రీదేవి పాత్ర పోషించారు. తాజాగా రామ్‌చరణ్‌ ‘వినయ విధేయ రామ’ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌కు ఓకే చెప్పారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement