
సాయిధరమ్ తేజ్‌తో ‘విన్నర్’, నాగచైతన్యతో ‘రారండోయ్ వేడుక చూద్దాం’, బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘జయ జానకి నాయక’ చిత్రాలతో పాటు.. మహేశ్‌బాబు ద్విభాషా చిత్రం ‘స్పైడర్’ లో హీరోయిన్‌గా నటించి మెరిసిన రకుల్‌ప్రీత్‌సింగ్ అకస్మాత్తుగా తెలుగు తెర నుండి అదృశ్యమైపోయారు. కెరీర్ ఆరంభం నుంచీ అడపాదడపా తమిళ్, హిందీ చిత్రాల్లో చేసినప్పటికి, తెలుగు సినిమానే తన ఫేవరెట్ ఇండస్ట్రీ అని ఆమె చెప్పేవారు. కానీ 2017 తర్వాత రకుల్ ఒక్క తెలుగు సినిమా కూడా సైన్ చేయలేదు!
అలాగని అవకాశం రాక మాత్రం కాదు. ఆమెకు తమిళ్‌లో టాప్ హీరోలతో నాలుగు సినిమాలు, హిందీలో రెండు సినిమాలు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది తెలుగులో ఖాతా ఓపెన్ చేయలేదు. ఇప్పుడు తాజా సమాచారం ఏంటంటే.. తనకు ఎన్టీఆర్‌తో ‘నాన్నకు ప్రేమతో’ లాంటి బ్లాక్‌బాస్టర్ హిట్ అందించిన సుకుమార్ దర్శకత్వంలో, మహేశ్‌బాబు లాంటి స్టార్ సరసన రెండో సినిమా చేసే అవకాశం రకుల్‌కు వచ్చింది! సంతకాలు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమా షూటింగ్ 2018 ఆఖర్లో ఆరంభం అవుతుంది. చిత్రాన్ని నిర్మిస్తున్నది మైత్రీ మూవీస్.
Comments
Please login to add a commentAdd a comment