'నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. ఈ సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది. అందరూ చాలా బాగా చేశారు. సత్య సినిమా నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఇది నా మొదటి సినిమా, మొదటి హీరో, మొదటి హీరోయిన్, మొదటి ప్రొడ్యూసర్.. నా అనుభవం నుంచి తీసిన కథ ఇది' అని డైరక్టర్ వాలి మోహన్ దాస్ చెప్పారు. గురువారం నాడు సత్య సినిమా టీజర్‌తో పాటు ఒక పాట రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత సతీష్ మాట్లాడుతూ.. విక్రమ్ "నాన్న" మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా, లోకేష్ కనగరాజ్ 'నగరం' మూవీలో ఓ పాత్రలో హమరేష్ నటించాడు. అప్పుడు హమరేష్‌లో ఉన్న ప్యాషన్ నాకు అర్ధం కాలేదు. పోను పోను తను పెట్టే ఎఫర్ట్ అర్ధమై.. గోపురం ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రంగోలి పేరుతో ఈ సినిమా స్టార్ట్ చేశాం. తమిళంలో ఈ మూవీ పెద్ద సక్సెస్ అయ్యింది.. తెలుగులోనూ ఆదరిస్తారనుకుంటున్నాం అన్నారు.
హీరో హమరేష్ మాట్లాడుతూ.. రంగోలి అనే తమిళ్ సినిమాని తెలుగులో సత్యగా మీ ముందుకు తీసుకువస్తున్నాము. చెన్నైలో రిలీజ్ అయ్యే ప్రతి తెలుగు సినిమా థియేటర్ లో చూసే వాడిని.. ఈ తెలుగు స్టేజ్ కు ఉన్న పవర్ నాకు తెలుసు. నాన్న శ్రీశైలం, అమ్మ చెన్నై కావడంతో నాకు తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలు రెండు కళ్ళతో సమానం అన్నారు.
చదవండి: ఆ సీన్ చేయనని ఏడ్చేసిన హీరోయిన్.. విలన్‌గా అది తప్పదన్న నటుడు
Comments
Please login to add a commentAdd a comment