![Mahesh Babu Daughter Sitara Will Voice Young Elsa In Telugu Version Of Frozen 2 - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/12/sitaraaaa.jpg.webp?itok=xr2drT23)
సితార
మహేశ్‌బాబు ముద్దుల కుమార్తె సితార సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టనున్నారు. అయితే అది ఆన్‌స్క్రీన్ ఎంట్రీ కాదు ఆఫ్‌స్క్రీన్ ఎంట్రీ. తెరపై కనిపించే పాత్ర కాదు. వినిపించే పాత్ర. హాలీవుడ్ యానిమేషన్ మూవీ ‘ఫ్రోజెన్ 2’. అన్నా, ఎల్సా అనే అక్కాచెల్లెళ్ల కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఎల్సా చిన్ననాటి పాత్రకు సితార డబ్బింగ్ చెప్పనున్నారు. తన బుజ్జిబిజ్జి మాటలతో ఎల్సా పాత్రకు డబ్బింగ్ చెబు తారట. ఎల్సా ఎంగేజ్ పాత్రకు నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ నెల 22న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆల్రెడీ యూట్యూబ్‌లో ఓ చానెల్‌లో ఎప్పటికప్పుడు వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు సితార. మరి భవిష్యత్తులో సినిమాల్లోకి వచ్చే ఆసక్తి ఉందా? వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment