హాలీవుడ్‌ సినిమాలో నటిస్తున్న శోభిత ధూళిపాల.. ఫోటో వైరల్‌ | Sobhita Dhulipala Begins Dubbing For The Monkey Man Film | Sakshi
Sakshi News home page

Sobhita Dhulipala : హాలీవుడ్‌ సినిమాలో నటిస్తున్న శోభిత ధూళిపాల.. ఫోటో వైరల్‌

Published Sun, Nov 6 2022 9:08 AM | Last Updated on Sun, Nov 6 2022 9:11 AM

Sobhita Dhulipala Begins Dubbing For The Monkey Man Film - Sakshi

గూఢచారి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శోభిత ధూళిపాల. మేజర్‌ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకున్న శోభిత రీసెంట్‌గా మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలో నటించింది.అయితే ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు సినిమాల కంటే పర్సనల్‌ లైఫ్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం ఓ టాలీవుడ్‌ యంగ్‌ హీరోతో డేటింగ్‌లో ఉందంటూ వార్తలు గుప్పమంటున్నాయి.

మొన్నటికి మొన్న దుబాయ్‌లో పెళ్లంటూ కొన్ని వెడ్డింగ్‌ ఫోటోలను షేర్ చేసి చివరికి అది ఓ యాడ్‌ కోసమంటూ తేల్చేసింది. ఇలా వరుసగా వార్తల్లో నిలుస్తున్న శోభిత తాజాగా హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఆమె హాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం మంకీ మ్యాన్‌. ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్‌ చెబుతున్నట్లు శోభిత స్వయంగా ఫోటోను షేర్‌చేసింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement