అప్పుడు భయపడ్డాను
అప్పుడు భయపడ్డాను
Published Wed, Nov 27 2013 2:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM
అందమే అసూయపడేంత అందాలను పుణికిపుచ్చుకున్న భామ అనుష్క అంటే అతిశయోక్తి కాదేమో. సుమారు దశాబ్ద కాలంగా దక్షిణాది సినీ ప్రేక్షకులను తన అందం, అభినయంతో దాసోహం చేసుకున్న ఈ జాణ తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అందులో ఒక అంశం పాఠశాలలో లైంగిక పాఠాలను ప్రవేశపెట్టాలన్నది. అనుష్క మాట్లాడుతూ తాను బెంగుళూరులో చదువుకుంటున్నప్పుడు కళాశాలలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ప్రచారం జరిగేదన్నారు. అప్పుడు ఈ విషయం గురించి పట్టించుకునే దాన్ని కానన్నారు.
ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను అంటుకోవడానికి వాళ్ల పక్కన కూర్చొని భోజనం చేయడానికి భయపడ్డానని అందుకు కారణం ఆ వ్యాధి తనకెక్కడ సోకుతుందోనన్న అనుమానమేనన్నారు. డాక్టర్ ప్రియ సర్కార్ పరిచయం తరువాత ఎయిడ్స్ వ్యాధి గురించి పూర్తిగా అవగాహన కలిగిందని చెప్పారు. అందువలనే పాఠశాల దశలోనే విద్యార్థులకు లైంగిక విద్యను బోధించాలని సూచించారు. తల్లిదండ్రులు ఈ విద్యను పిల్లలకు అభ్యసింపచేయాలని అన్నారు. సినిమాల వలనే లైంగిక దాడులు అధికమై ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు సంఖ్య పెరుగుతోందంటే మాత్రం తాను అంగీకరించనని స్పష్టం చేశారు.
హెచ్‌ఐవీ బారిన పడటం అనేది వారి ప్రవర్తన బట్టి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎయిడ్స్ రోగులకు సంబంధించిన సినిమాలు రాకపోవడానికి కారణం ఏమిటంటే, ఈ ప్రశ్నకు తాను బదులివ్వలేనని దర్శక నిర్మాతలే సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. తాను నటిని మాత్రమేనని ఎయిడ్స్ అవగాహన చిత్రాల్లో నటించడానికి తాను సిద్ధం అని అనుష్క తెలిపారు. ఇటీవల ఎయిడ్స్ అవగాహన యానిమేషన్ చిత్ర విలేకరుల సమావేశంలో పాల్గొన్న అనుష్క ఈ విషయూలు వెల్లడించారు.
Advertisement