అద్భుతాలకు నిలయం ఈ ఆధునిక కాలం. అదేవిధంగా ప్రతిభ ఏ ఒక్కరి సొత్తూ కాదు. అలా 5వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల విద్యార్థిని గూండాన్ చట్టి అనే యానిమేషన్ చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ చిన్నారి పేరు పీకే అగస్త్యి. ఈ వయసులోనే తనకు కలిగిన ఆలోచనతో సినిమా తీస్తానని తన తండ్రి డాక్టర్ ఎస్‌కే.కార్తికేయన్‌కు చెప్పగా ఆయన ఈ వయసులో చిత్రం ఏమిటి, దర్శకత్వం ఏమిటి అని నిరాశపరచకుండా తన కూతురి ఆలోచనను గౌరవించి, ఆ చిన్నారిని ప్రోత్సహించారు. అలా ఆమె దర్శకత్వంలో నిర్మించిన చిత్రం గూండాన్ చట్టి.
గ్రామీణ నేపథ్యంలో అగస్త్యి రూపొందించిన ఈ యానిమేషన్ చిత్రం పలువురు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలను అందుకుంటోంది. ఒక గ్రామంలోని ఇద్దరు స్నేహితులకు ఒకేసారి పుట్టిన పిల్లలు ఆ గ్రామంలో జరుగుతున్న అక్రమాలను ఎలా అరికట్టారు? అనే చక్కని సందేశానికి వినోదాన్ని చేర్చి జనరంజకంగా రూపొందించిన చిత్రం ఇది. అగస్త్యి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ చిత్రంలో 3 మంచి పాటలున్నాయి.
ఒక విద్యార్థిని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రదర్శించే విధంగా నిర్మాత చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఇది విద్యార్థుల వికాసాన్ని పెంపొందించే చిత్రంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రానికి అమర్గీత్ సంగీతాన్ని అందించారు. కథనం, మాటలు, పాటలు, దర్శకత్వ సహకార బాధ్యతలను చిన్నతంబి నిర్వహించారు. కాగా గూండాన్ చట్టి చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది.
చదవండి: అమ్మ కోసం అన్ని వదిలేసి.. దుకాణం నడుపుతూ.. ఇప్పుడు స్టార్ హీరోలతో!
Comments
Please login to add a commentAdd a comment