![Spider Man Co Creator Steve Ditko Passes Away - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/7/Steve-Detko-Spiderman-Passe.jpg.webp?itok=kGaB1F0v)
సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ సృష్టికర్త స్టీవ్ డిట్కో కన్నుమూశారు. ఆయన మృతి వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 90 ఏళ్ల డిట్కో న్యూయార్క్‌లోని తన ఇంట్లో జూన్ 29న విగత జీవిగా పడి ఉండటాన్ని పోలీసులు కనుగొన్నారు. అంతకు రెండురోజుల ముందే ఆయన ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఆయన మృతిపై గల కారణాలపై స్పష్టత లేదు. ఒంటరితనం భరించలేకే ఆయన సూసైడ్ చేసుకుని ఉంటారని భావిస్తున్నారు.
1961లో మార్వెల్ కామిక్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ స్టాన్‌లీతో కలిసి డిట్కో.. స్పైడర్‌మ్యాన్ పాత్రను రూపొందించారు. ఆ క్రెడిట్ స్టాన్‌లీదే అయినా.. స్పైడర్‌మ్యాన్ కాస్టూమ్స్, వెబ్ షూటర్స్, డిజైన్ ఇలా అంతా డిట్కో ఆలోచనలోంచి పుట్టిందే. తొలుత కామిక్ రూపకంలో వచ్చిన స్పైడర్‌మ్యాన్ కు అనూహ్య స్పందన రావటంతో చిన్నచిన్న మార్పులు చేసి యానిమేటెడ్ సిరీస్‌గా మార్వెల్ కామిక్స్ రూపొందించింది. స్పైడర్‌మ్యాన్‌తోపాటు ఆ సిరీస్‌లోని విలన్ పాత్రలు గ్రీన్ గోబ్లిన్, డాక్టర్ అక్టోపస్, సాండ్‌మ్యాన్, ది లిజర్డ్ అన్నీ డిట్కో డిజైన్ చేశారు. వీటితోపాటు 1963లో డాక్టర్ స్ట్రేంజ్ పాత్రను ఆయన రూపొందించారు. అనంతరం సహచరుడు స్టాన్‌లీతో విభేదాల కారణంగా మార్వెల్ కామిక్స్‌కు గుడ్‌బై చెప్పిన డిట్కో.. డీసీ కామిక్స్, ఛార్ల్‌టోన్, మరికొన్ని ఇండిపెండెంట్ పబ్లిషర్స్‌తో పని చేశారు. తిరిగి 1979లో మార్వెల్‌కు తిరిగొచ్చిన ఆయ.. మెషీన్ మ్యాన్, మైక్రోనట్స్ లాంటి పాత్రలను రూపొందించారు. 1992లో స్క్విరిల్ గర్ల్ ఆయన రూపొందించిన చివరి పాత్ర. ఆయన మృతిపై హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment