రూ.200కోట్ల దిశగా ‘సింబా’ | Ranveer Singh Simmba Collected 150 Crores In One Week | Sakshi
Sakshi News home page

Published Fri, Jan 4 2019 3:52 PM | Last Updated on Fri, Jan 4 2019 3:52 PM

Ranveer Singh Simmba Collected 150 Crores In One Week - Sakshi

పూరి జగన్నాద్‌ మార్క్‌ మ్యానరిజం.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కాంబోలో వచ్చిన టెంపర్‌ టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇక అప్పటి నుంచి ఈ చిత్రాన్ని పలు భాషల్లో తెరకెక్కించాలని బాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రయత్నించాయి. కోలీవుడ్‌లో విశాల్‌ ‘అయోగ్య’ గా తెరకెక్కిస్తుండగా.. బాలీవుడ్‌లో రణవీర్‌సింగ్‌ ‘సింబా’ గా రీమేక్‌ చేశారు. 

ఈ చిత్రం గతవారం విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. అయితే ఎన్టీఆర్‌ నటనకు, రణవీర్‌ నటకు పోలిక లేకున్నా.. సినిమా మాత్రం హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా కేవలం ఐదు రోజుల్లోనే వందకోట్లు, ఏడు రోజుల్లోనే 150కోట్లను కొల్లగొట్టింది. ఇక ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలేవీ విడుదల కాలేదు. అయితే ఇదే జోరును కొనసాగిస్తే.. ‘సింబా’ 200కోట్లను దాటేసి.. 250కోట్లను వసూళ్లు చేసే అవకాశంఉందని ప్రముఖ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ పేర్కొన్నారు. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సారా అలీఖాన్‌ హీరోయిన్‌గా నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement