ఒకరు ఎక్కువ.. ఇంకొకరు తక్కువే కదా! | Ranveer Singh Teasing Alia Bhatt In Gully Boy Movie Promotion | Sakshi
Sakshi News home page

ఒకరెక్కువ.. మరొకరు కొంచెం తక్కువ కదా!

Published Thu, Jan 10 2019 1:23 PM | Last Updated on Thu, Jan 10 2019 1:31 PM

Ranveer Singh Teasing Alia Bhatt In Gully Boy Movie Promotion - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ఇటీవలే విడుదలైన ‘సింబా’ సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టిన ఈ ఎనర్జిక్‌ స్టార్‌.. ప్రస్తుతం తన అప్‌కమింగ్‌ మూవీ ‘గల్లీ బాయ్‌’ ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు. జోయా అక్తర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రణ్‌వీర్‌కు జోడీగా అలియా భట్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. మేరీ గల్లీ, రూట్స్‌లాంటి హిట్ ర్యాప్ సాంగ్స్ సృష్టికర్త అయిన ఇండియన్ ర్యాపర్ డివైన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ప్రేమికుల రోజు(ఫిబ్రవరి 14)న విడుదల కానుంది.

కాగా గల్లీ బాయ్‌ సినిమా ట్రైలర్‌ను బుధవారం విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా రణ్‌వీర్‌, అలియా సరదాగా మీడియాతో ముచ్చటించారు. ఇందులో భాగంగా... ‘మీ కో- స్టార్లు రణ్‌బీర్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌లలో ఎవరికి ఎక్కువ మార్కులు ఇస్తారు అని విలేకరులు ప్రశ్నించగా... ‘ఇద్దరూ గొప్ప నటులే. అంతేకాదు మానవత్వమున్న మంచి మనుషులు కూడా. తేడా ఏంటంటే రణ్‌బీర్‌తో నేను నటించింది బ్రహ్మాస్త్రలో.. రణ్‌వీర్‌తో గల్లీబాయ్‌లో’ అంటూ అలియా చమత్కరించింది. వెంటనే మైక్‌ అందుకున్న రణ్‌వీర్‌.. ‘నిజాలు చెప్పాలి.. ఇద్దరిలో ఒకరు తక్కువ(తాను).. మరొకరు ఎక్కువ(రణ్‌బీర్‌) ఎక్కువ కదా’  అంటూ ఆమెను ఆటపట్టించాడు. ఇక అలియా, రణ్‌బీర్‌ ప్రస్తుతం డేటింగ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

గల్లీ బాయ్‌ ట్రైలర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement