అజయ్ దేవగణ్‌కు నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉందంటున్నాడు దర్శకుడు రోహిత్ శెట్టి. పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలు తెరకెక్కించడంలో బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు రోహిత్ శెట్టి. ఈ మధ్యే రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా రూపొందిన ‘సింబా’ చిత్రం విడుదలై విజయవంతంగా దూసుకుపోతుంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ.100 కోట్లు రాబట్టిన ఈ సినిమా రూ.200 కోట్ల వసూళ్లవైపు పరుగుతీస్తోంది. బాలీవుడ్‌లో వరుసగా రూ.100 కోట్లు రాబట్టిన ఎనిమిది సినిమాలు తీసిన దర్శకుడిగా రోహిత్ చరిత్ర సృష్టించారు.
అయితే సింబా సినిమాలో హీరో అజయ్ దేవగణ్ అతిథి పాత్రలో కనిపించారు. ఈ విషయం గురించి రోహిత్ మాట్లాడుతూ.. ‘నా జీవితంలో అజయ్‌కు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఆయన నాకు చాలా సాయం చేశారు. ఈ రోజు నేనిలా ఉన్ననాంటే అదంతా అజయ్ వల్లనే’ అంటూ చెప్పుకొచ్చారు. అలానే ‘ప్రస్తుతం పరిశ్రమలో నేను చాలామందితో కలిసి పని చేశాను. వారంతా నాకు స్నేహితులు. కానీ అజయ్ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకం. ఆయన మంచి నటుడు, స్టార్ అని ఇలా చెప్పడం లేదు. అజయ్ నాకు అన్నయ్యలాంటి వారు.. దాన్ని ఎవరూ మార్చలేరు’ అన్నారు. అలానే రణ్‌వీర్ తనకు తమ్ముడులాంటి వారంటూ చెప్పుకొచ్చారు రోహిత్ శెట్టి.
Comments
Please login to add a commentAdd a comment