గొర్రెకు గొర్రెకు జన్మించిన వింత పశువు
ఖానాపురం(నర్సంపేట) వరంగల్ : గొర్రెకు వింత పశువు జన్మించిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన భూషబోయిన ఐలుమల్లుకు గొర్రెల మంద ఉంది.
ఇందులో ఒక గొర్రె బుధవారం ఉదయం ఇంటి వద్ద ఈనింది. దీంతో గొర్రె ఈనే క్రమంలో వింత ఆకారంలో ఉన్న పశువుకు జన్మనిచ్చింది. దీంతో ఐలుమల్లు ఆశ్చర్యానికి గురై చుట్టుపక్కల వారికి తెలియజేయగా స్థానికులు అధిక సంఖ్యలో వచ్చి చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు.
జన్మించిన కొద్ది సమయంలోనే వింత పశువు మృతిచెందింది. ఇదే విషయమై మండల పశువైద్యాధికారి శ్రీలక్ష్మిని వివరణ కోరగా జన్యుపరమైన లోపంతో అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని తెలిపారు. పుట్టిన పశువులో ఎదుగుదల లేకపోవడంతోనే అలా జన్మించిందని ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment