Strange animal
-
మనిషి ముఖం ఆకారంలో వింత పురుగు
గద్వాల రూరల్: మండలంలోని చెనుగోనిపల్లిలో బుధవారం మానవాకారంలో ఉన్న వింత పురుగు కనిపించింది. గ్రామంలోని హలీంపాష ఇంట్లోని చెట్టుపై కనిపించగా, పురుగుకు తల, ముక్కు, కళ్లు, చెవులు ఉండడంతో అచ్చం మనిషి తల ఆకారంలో కనిపించడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. వింతపురుగును చూడడానికి చుట్టుపక్కల వారు తరలివచ్చారు. ఈ పురుగు విషయంపై కేవీకే పాలెం వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ శైలను సంప్రదించగా.. ఈ పురుగు ‘మైనర్ ఫెస్ట్ స్టింక్ బగ్’ జాతికి చెందినదని, ఇది మానవుని తలను పోలి ఉండడంతో దీనికి ‘మ్యాన్ ఫెస్ స్టింక్ బగ్’ అని నామకరణం చేసినట్లు తెలిపారు. ఇది రసం పీల్చే పురుగు అని చెట్లపై, ఆకులపై నివాసంగా చేసుకుని జీవిస్తుందన్నారు. ఇది దుర్వాసనను వెదజల్లుతుందన్నారు. అదేవిధంగా ఇదేమి మనుషులకు, వ్యవసాయ పంటలకు హాని చేసే రకం కాదన్నారు. ఈ పురుగు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. -
పాములా ఉన్నా.. పాము కాదు.. మరేంటి?
సాక్షి, నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లీ మర్రిపాడు మండలంలోని పడమటి నాయుడుపల్లిలో మంగళశారం ఓ వింత జీవి కలకలం సృష్టించింది. సన్నగా దారంలా ఉన్న ఈ జీవి పాము లాగా పాకుతున్న దీన్ని గ్రామంలోని కత్తి కొండమ్మ ఇంట్లో గ్రామస్తులు గుర్తించారు. అయితే ఇది పాము కాదని వారు అంటున్నారు. అటవీ ప్రాంతం నుంచి తరుచుగా ఇలాంటి జీవులు గ్రామంలోకి వస్తాయని అన్నారు. -
తూర్పుగోదావరిలో వింత జంతువు కలకలం..
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని జొన్నాడలో వింత జంతువు కలకలం రేపింది. కొద్దిరోజులుగా ఆ జంతువు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు స్థానికులు సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆ వింత జంతువు పశువులపై దాడిచేసి చంపుతున్నట్లు వారు చెప్తున్నారు. ఆలమూరు మండలం పెనికేరులోని ఓ పాడుబడ్డ బావిలో ఆ వింత జంతువు ఉన్నట్లు రైతులు గుర్తించారు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చదవండి: (షాకిచ్చిన కరెంటు బిల్లు.. నోటమాట రాలేదు..) -
వైరల్ : అది దెయ్యమా.. భూతమా..!
నేరాలు, ఘోరాల నియంత్రణకు, నిర్ధారణకు సీసీటీవీ కెమెరాలు సాయపడతాయని మనందరికీ తెలుసు. అయితే, వీవీయాన్ గోమెజ్ అనే మహిళకు మాత్రం తన ఇంటి పరిసరాల్లో సంచరిస్తున్న ఓ వింత ఆకారాన్ని పరిచయం చేసాయి. రోజూ ఉదయం నిద్రలేవగానే తమ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా ఫుటేజీలు పరిశీలించడం ఆమెకు అలవాటు. గత ఆదివారం ఉదయం కూడా ఆమె అలానే చేశారు. కానీ, ఊహించని షాక్‌కు గురయ్యారు. వీడియో ప్రకారం.. బిల్డింగ్ సెల్లార్ నుంచి ఓ వింత ఆకారం బయటి కొచ్చింది. ఎముకల గూడుగా ఉన్న ఆ అతి పలుచని శరీరాన్ని చూసి ఆమె భయంతో వణికిపోయారు. ‘ఆదివారం ఉదయం నిద్రలేవగానే ఇంటి ఆవరణలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించాను. సెల్లార్లో నుంచి ఏదో ఆకారం బయటకు పరుగెత్తుకుంటూ వచ్చింది. తొలుత దాని నీడ చూసి ఏదైనా జంతువు కావచ్చు అనుకున్నాను. కానీ అది భయంగొల్పే ఆకారంలో ఉంది. కారు ముందుకు వచ్చి అదోరకమైన ఆనందంతో చిందులు వేసింది. స్టన్ అయ్యాను’ అని తన ఫేస్బుక్ పేజీలో ఆ ఘటన తాలూకు అనుభవాలను చెప్పుకొచ్చారామే. ఇక ఈ వీడియోలో ఉన్న ఆ వింత జీవి గురించి ఎవరికి వారు తమవైన విశ్లేషణలు, అనుభవాలు జోడించి చెప్తున్నారు. ఇది దెయ్యమే అని ఒకరు.. ‘కాదు అంతా నాటకం కావాలనే మమ్మల్ని తప్పదోవ పట్టిస్తున్నారు. ఇది పక్కా ప్రాంక్ వీడియో’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇది హ్యారీపొటర్ సినిమాలోని డాబీ మ్యాజికల్ హౌజ్‌లో ఉన్న జీవిగా ఉందని మరొకరు చెప్పారు. ఈ వీడియోకు 30 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. -
గొర్రెకు వింత పశువు జననం
ఖానాపురం(నర్సంపేట) వరంగల్ : గొర్రెకు వింత పశువు జన్మించిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన భూషబోయిన ఐలుమల్లుకు గొర్రెల మంద ఉంది. ఇందులో ఒక గొర్రె బుధవారం ఉదయం ఇంటి వద్ద ఈనింది. దీంతో గొర్రె ఈనే క్రమంలో వింత ఆకారంలో ఉన్న పశువుకు జన్మనిచ్చింది. దీంతో ఐలుమల్లు ఆశ్చర్యానికి గురై చుట్టుపక్కల వారికి తెలియజేయగా స్థానికులు అధిక సంఖ్యలో వచ్చి చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. జన్మించిన కొద్ది సమయంలోనే వింత పశువు మృతిచెందింది. ఇదే విషయమై మండల పశువైద్యాధికారి శ్రీలక్ష్మిని వివరణ కోరగా జన్యుపరమైన లోపంతో అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని తెలిపారు. పుట్టిన పశువులో ఎదుగుదల లేకపోవడంతోనే అలా జన్మించిందని ‘సాక్షి’కి తెలిపారు. -
వింత గొర్రెపిల్ల జననం
అల్గునూర్(మానకొండూర్) పెద్దపల్లి : తిమ్మాపూర్ మండల కేంద్రం లో అట్ల రాజయ్యకు చెందిన గొర్రెకు శుక్రవారం వింత పిల్ల జన్మించింది. ఒకే తల, ఎనిమిది కాళ్లతో జన్మించింది. దీనిని స్థానికులు వింతగా చూశారు. జన్యులోపం కారణంగా ఇలాంటి గొర్రెపిల్లలు జన్మిస్తాయని పశువైద్యాధికారి సురేందర్‌రెడ్డి తెలిపారు. గొర్రెపిల్ల పుట్టిన వెంటనే చనిపోయింది. -
వింత జంతువుకు జన్మనిచ్చిన సబ్సిడీ గొర్రె ...
సాక్షి, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చిన ఓ గొర్రె వింత జంతువుకు జన్మనిచ్చింది. ఈ ఘటన మెదక్ మండలం ర్యాలమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. ఈ వింత జంతువును చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి జనాలు తరలివచ్చారు. అంతటితో ఆగకుండా సెల్ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. కుల వృత్తులను ప్రోత్సహించాలనే ధ్యేయంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సబ్సిడీ గొర్రెల పథకంతొ గొర్రెల పంపిణీ చేసిన విషయం తెలిసిందే. -
వింత జంతువు విధ్వంసం
♦ నియాలిలో కుప్పలు తెప్పలుగా గొర్రెల మరణం ♦ నర మేక దాడి అని అపోహ! ♦ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్న అటవీ సంరక్షక విభాగం భువనేశ్వర్: కటక్ జిల్లా నియాలి ప్రాంతంలో గత కొద్ది రోజులుగా గొర్రెలు కుప్పలు తెప్పలుగా మరణిస్తున్నాయి. ఆకస్మిక రోగ సంక్రమణ కాదు. అస్పష్టమైన దాడితో ఈ జీవులు అకారణంగా మరణిస్తున్నట్టు గ్రామంలో తీవ్ర భయాందోళనల చోటు చేసుకున్నాయి. శాలలో కట్టి ఉంచిన గొర్రెలపై ఈ దాడులు జరుగుతున్నాయి. గొర్రెల్ని చీల్చి చెండాడి చంపేస్తున్నట్టు వాస్తవ దృశ్యాలు రుజువు చేస్తున్నాయి. అయితే ఇదంతా మానవ కృత్యమా? అదృశ్య శక్తి దాడులా? క్షుద్ర శక్తుల ప్రయోగమా? కక్షదార్ల కుట్రా? ఇలా పలు సందేహాలతో నియాలి గ్రామస్తులు తల్లడిల్లుతున్నారు. విష ప్రయోగం అయితే కానే కాదని స్పష్టం అయిపోయింది. సోషల్ వైరల్ ఈ పరిస్థితుల్లో అద్భుత రూపం దాల్చిన జీవి గొర్రెల్ని హతమార్చుతుందనే సోషల్ మీడియా వైరల్ బలం పుంజుకుంది. మేక పోతు రూపంతో ముఖం మినహా శరీరం అంతా మానవ ఆకృతి కలిగి(నర మేక) ఉన్నట్టు ఈ ప్రసారం దుమారం రేపింది. ఈ ప్రసారంలో ఎంత మాత్రం నిజం లేదని రాష్ట్ర పశు సంవర్థక విభాగం మంత్రి డాక్టర్ దామోదర్ రౌత్ తెలిపారు. ఇదంతా దుమ్ములగొండి దాడి అయి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దాడి చోటు చేసుకున్న శాల పరిసరాల్లో కొన్ని అంతు చిక్కని పాద ముద్రల్ని గుర్తించారు. దాడులకు గురైన శాలల్ని పరిశీలించారు. ఏదో జంతువు ఈ చర్యకు పాల్పడుతున్నట్లు ఈ ఛాయలు స్పష్టం చేస్తున్నాయి. దాడుల్లో కొన్ని గొర్రెలు అదృష్టవశాత్తు స్వల్పంగా గాయపడి ప్రాణాలతో బయటపడుతున్నాయి. వీటిపై మిగిలిన ఆనవాళ్ల ప్రకారం గుర్తు తెలియని జంతువు బలంగా కరిచి గాయపరిచినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఏదో జంతువు మాత్రమే దాడులకు పాల్పడుతున్నట్టు విజ్ఞుల అభిప్రాయం. అదేమిటో స్పష్టం కావలసి ఉంది. సీసీటీవీ కెమెరాలతో నిగ్గు తేల్చుతాం: చీఫ్ కంజర్వేటరు నియాలి ప్రాంతంలో గొర్రెలపై దాడులకు సంబంధించి బలపడిన అపోహల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించాల్సి ఉంది. అభూత కల్పనతో పేరుకుపోయిన భయాందోళనల్ని తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని అటవీ సంరక్షక విభాగం ప్రధాన అధికారి పీసీసీఎఫ్ ఎస్.ఎస్.శ్రీవాస్తవ తెలిపారు. ఈ దాడుల నిగ్గు తేల్చేందుకు ప్రభావిత ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాల్ని అమర్చేందుకు నిర్ణయించినట్టు మంగళవారం ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో 5 చోట్ల సీసీటీవీ కెమెరాల్ని ఏర్పాటు చేస్తారు. భయాందోళన కలిగిస్తున్న జంతువుని గుడా రం నుంచి బయటకు రప్పించేందుకు బాణసంచ కా ల్చి దుమారం రేపుతారు. అంతకు ముందే పరిసర ప్రా ంతాల్లో వల పన్ని జంతువు పని పడతామని ఆయన వివరించారు. పరిస్థితులపై నిఘా వేసేందుకు అటవీ సంరక్షణ విభాగం 3 ప్రత్యేక స్క్వాడ్‌ల్ని నియమించింది. గొర్రెల శాలల్లో రాత్రి పూట దీపాలు వెలిగించేందుకు సంబంధీకులకు సలహా జారీ చేశారు. మృత గొర్రెల దేహ నమూనాల్ని పశువుల రోగాలు, పరిశోధన సంస్థ సేకరించి ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తుంది. గ్రామస్తుల గాలింపు పరిసర అటవీ ప్రాంతాల నుంచి, జనావాసం నుంచి ఏదో జంతువు తరలి వచ్చి గొర్రెలపై దాడికి పాల్పడుతుందనే భావనతో నియాలి గ్రామస్తులు గాలింపు ప్రారంభించారు. రాత్రి పూట పరిసర బొనొసాహి గ్రామం ప్రాంతంలో రాత్రంతా చీకటిలో నిఘా వేశారు. అంతు చిక్కని జంతువు దాడుల్లో 2, 3 రోజుల్లో 150 పెంపుడు గొర్రెలు మరణించాయి. ప్రభుత్వ యంత్రాంగం ఈ మేరకు పెదవి కదపకుండా చోద్యం చూస్తుంది. ఇదే వైఖరి కొనసాగితే ఈ పరిణామం ఎలా దారి తీస్తాయోననే భయాందోళనలు విస్తరిస్తున్నాయి. జిల్లా యంత్రాంగం నిర్మాణాత్మక కార్యాచరణతో తక్షణమే ముందుకు రావాలని బాధిత గ్రామస్తులు అభ్యర్థిస్తున్నారు.