
కానీ అది భయంగొల్పే ఆకారంలో ఉంది. కారు ముందుకు వచ్చి అదోరకమైన ఆనందంతో చిందులు వేసింది. స్టన్ అయ్యాను
నేరాలు, ఘోరాల నియంత్రణకు, నిర్ధారణకు సీసీటీవీ కెమెరాలు సాయపడతాయని మనందరికీ తెలుసు. అయితే, వీవీయాన్ గోమెజ్ అనే మహిళకు మాత్రం తన ఇంటి పరిసరాల్లో సంచరిస్తున్న ఓ వింత ఆకారాన్ని పరిచయం చేసాయి. రోజూ ఉదయం నిద్రలేవగానే తమ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా ఫుటేజీలు పరిశీలించడం ఆమెకు అలవాటు. గత ఆదివారం ఉదయం కూడా ఆమె అలానే చేశారు. కానీ, ఊహించని షాక్‌కు గురయ్యారు. వీడియో ప్రకారం.. బిల్డింగ్ సెల్లార్ నుంచి ఓ వింత ఆకారం బయటి కొచ్చింది. ఎముకల గూడుగా ఉన్న ఆ అతి పలుచని శరీరాన్ని చూసి ఆమె భయంతో వణికిపోయారు.
‘ఆదివారం ఉదయం నిద్రలేవగానే ఇంటి ఆవరణలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించాను. సెల్లార్‌లో నుంచి ఏదో ఆకారం బయటకు పరుగెత్తుకుంటూ వచ్చింది. తొలుత దాని నీడ చూసి ఏదైనా జంతువు కావచ్చు అనుకున్నాను. కానీ అది భయంగొల్పే ఆకారంలో ఉంది. కారు ముందుకు వచ్చి అదోరకమైన ఆనందంతో చిందులు వేసింది. స్టన్ అయ్యాను’ అని తన ఫేస్‌బుక్ పేజీలో ఆ ఘటన తాలూకు అనుభవాలను చెప్పుకొచ్చారామే. ఇక ఈ వీడియోలో ఉన్న ఆ వింత జీవి గురించి ఎవరికి వారు తమవైన విశ్లేషణలు, అనుభవాలు జోడించి చెప్తున్నారు. ఇది దెయ్యమే అని ఒకరు.. ‘కాదు అంతా నాటకం కావాలనే మమ్మల్ని తప్పదోవ పట్టిస్తున్నారు. ఇది పక్కా ప్రాంక్ వీడియో’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇది హ్యారీపొటర్ సినిమాలోని డాబీ మ్యాజికల్ హౌజ్‌లో ఉన్న జీవిగా ఉందని మరొకరు చెప్పారు. ఈ వీడియోకు 30 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం.