గద్వాల రూరల్: మండలంలోని చెనుగోనిపల్లిలో బుధవారం మానవాకారంలో ఉన్న వింత పురుగు కనిపించింది. గ్రామంలోని హలీంపాష ఇంట్లోని చెట్టుపై కనిపించగా, పురుగుకు తల, ముక్కు, కళ్లు, చెవులు ఉండడంతో అచ్చం మనిషి తల ఆకారంలో కనిపించడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. వింతపురుగును చూడడానికి చుట్టుపక్కల వారు తరలివచ్చారు.
ఈ పురుగు విషయంపై కేవీకే పాలెం వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ శైలను సంప్రదించగా.. ఈ పురుగు ‘మైనర్ ఫెస్ట్ స్టింక్ బగ్’ జాతికి చెందినదని, ఇది మానవుని తలను పోలి ఉండడంతో దీనికి ‘మ్యాన్ ఫెస్ స్టింక్ బగ్’ అని నామకరణం చేసినట్లు తెలిపారు. ఇది రసం పీల్చే పురుగు అని చెట్లపై, ఆకులపై నివాసంగా చేసుకుని జీవిస్తుందన్నారు. ఇది దుర్వాసనను వెదజల్లుతుందన్నారు. అదేవిధంగా ఇదేమి మనుషులకు, వ్యవసాయ పంటలకు హాని చేసే రకం కాదన్నారు. ఈ పురుగు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment