
ఏసీబీ వలలో విద్యుత్ ఏఈ
వనపర్తి: లంచం తీసుకుంటూ విద్యుత్‌శాఖ ఏఈ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ వివరాల మేరకు.. ఖిల్లాఘనపురం మండలం మల్కాపురం గ్రామ శివారులో నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తిరుమల ఆగ్రో ఇండస్ట్రీస్ పేరిట రైస్‌మిల్లు నిర్మాణం చేపట్టాడు. ఈ రైస్‌మిల్లుకు విద్యుత్ సౌకర్యం కోసం టీజీఎస్పీడీఎల్‌కు డీడీ చెల్లించారు. విద్యుత్‌శాఖ అధికారులు టెండర్ ప్రక్రియ పూర్తిచేసి.. ఆ పనులను సలీం అనే కాంట్రాక్టర్‌కు అప్పగించారు. పనులు పూర్తయిన తర్వాత విద్యుత్ కనెక్షన్ ఇవ్వాల్సిందిగా సదరు కాంట్రాక్టర్ విద్యుత్‌శాఖ ఏఈ కొండయ్యను కోరగా.. రూ. 20వేలు డిమాండ్ చేశాడు. పనులు కొనసాగుతున్న సమయంలోనే సదరు ఏఈ కొంత మొత్తం (రూ. 30వేలు) లంచంగా తీసుకున్నాడు. విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు మరో రూ. 20వేలు డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్ సలీం ఏసీబీని ఆశ్రయించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎస్‌ఈ కార్యాలయం వద్ద ఉన్న సదరు కాంట్రాక్టర్‌ను డబ్బులు ఇవ్వాల్సిందిగా ఏఈ డిమాండ్ చేశాడు. అయితే అప్పటికే ఏసీబీ అధికారులతో టచ్‌లో ఉన్న కాంట్రాక్టర్.. వారిచ్చిన డబ్బును ఏఈకి ఇచ్చారు. వాటిని తీసుకుని ప్యాంటు జేబులో పెట్టుకున్న వెంటనే ఏసీబీ అధికారులు పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఏఈ కొండయ్యపై కేసు నమోదుచేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
అవినీతికి అడ్డుకట్ట ఏది?
గతేడాది మే 31న విద్యుత్‌శాఖలో ముగ్గురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌శాఖ అధికారులు లంచం అడిగితే తమకు సమాచారం ఇవ్వాలంటూ కార్యాలయంలో పలు చోట్ల స్టిక్కర్లు అంటించారు. అయితే ఎస్‌ఈ, డీఈఈ, ఏఈ స్థాయి అధికారులు ఒకేసారి ఏసీబీకి పట్టుబడిన 11 నెలల వ్యవధిలోనే మరో అధికారి ఏసీబీకి చిక్కడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ వరుస ఘటనలతో విద్యుత్‌శాఖలో ఏమేర అవినీతి జరుగుతుందనే విషయం సామాన్యులు సైతం అంచనా వేసే స్థితికి వచ్చిందంటూ స్థానికుల్లో చర్చ వినిపిస్తోంది.
రైస్‌మిల్లుకు విద్యుత్ కనెక్షన్
ఇచ్చేందుకు రూ. 20వేలు డిమాండ్
కాంట్రాక్టర్ నుంచి రూ.10వేలు
తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా
పట్టుకున్న ఏసీబీ

ఏసీబీ వలలో విద్యుత్ ఏఈ