
108, 102 వాహనాల తనిఖీ
పాలమూరు/జడ్చర్ల: మహబూబ్‌నగర్, జడ్చర్లలోని 108, 102 వాహనాలను గురువారం ఆ శాఖ రాష్ట్ర అధికారి గిరీష్‌బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాల్లోని రికార్డులు, పరికరాల పనితీరు, నిర్వహణను పరిశీలించారు. క్షతగాత్రులు, రోగులను ఆస్పత్రులకు తరలించే సమయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, అందిస్తున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. సమయ పాలన, నిర్వహణ తదితర అంశాలపై ఆరా తీశారు. అదేవిధంగా 102 అమ్మ ఒడి వాహనాల నిర్వాహకులకు పలు సూచలు చేశారు. గర్భిణులను సకాలంలో ఆస్పత్రులకు తరలించేందుకు సిద్ధంగా, శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నిర్వహణలో ఎక్కడా నిర్లక్షం కనిపించరాదని తెలిపారు. ఆయన వెంట ప్రోగ్రామ్ మేనేజర్ రవికుమార్, జిల్లా కో–ఆర్డినేటర్ ఉదయ్ తదితరులు ఉన్నారు.