సాక్షి, హైదరాబాద్: గొర్రెల పంపిణీ స్కాంలో ఇద్దరు కీలక నిందితులు విదేశాలకు పరారైనట్లు అధికారులు గుర్తించారు. విదేశాలకు పారిపోయిన నిందితులు ఫిర్యాదు దారులను బెదిరింపులకు గురిచేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ అరెస్టు చేసింది. ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్, ఒక డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్లను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. రవి, ఆదిత్య కేశవ సాయి, రఘుపతి రెడ్డి, సంగు గణేష్‌లను ఏసీబీ అరెస్ట్ చేసింది. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచిన పశుసంవర్ధన శాఖ అధికారులు.. 2.10 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను మళ్లించారు.
రికార్డుల పరిశీలన, బాధితుల నుంచి వివరాలు సేకరించి ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారనే ఆధారాలను సేకరించారు. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్ల పాత్రలపైనా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయన ఇటీవల కాగ్ కూడా తన నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment