సాక్షి, న్యూఢిల్లీ : భారత్ దేశంలో కుక్కల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. విదేశాల్లో కుక్కలతోపాటు పిల్లులను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. పిల్లలాగే అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. దేశ, విదేశాల్లో గొర్రెలను కూడా పెంచుకుంటారు. పెరిగి పెద్దదయ్యాక కోసుకొని దాని మాంసం ఆరగించేందుకే. అయితే నల్ల ముక్కు కలిగిన స్విడ్జర్లాండ్‌కు చెందిన ‘వలాయిస్’ జాతి గొర్రె పిల్లలను లండన్ లాంటి దేశాల్లో పెంపుడు కుక్కల వలె పెంచుకుంటారు. అందుకు కారణం ప్రపంచ గొర్రెల జాతుల్లోకెల్లా అవి అత్యంత అందంగా ఉండడమే. ఆ జాతికి చెందిన ఓ గొర్రె పిల్ల భారతీయ కరెన్సీలో ఆరున్నర లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు పలుకుతుంది. అంటే మామూలు గొర్రె పిల్లలకన్నా వాటి ధర దాదాపు 40 రెట్లు ఎక్కువ. ఈ జాతి గొర్రె పిల్లల నుంచి ఉన్ని ఎక్కువ రావడమే కాకుండా మాంసం కూడా బలే రుచిగా ఉంటుందట.
ఇంగ్లండ్‌లోని ఉత్తర డెవాన్‌లో వారం క్రితం ఈ జాతికి చెందిన మూడు గొర్రె పిల్లలు ఫామ్‌లో జన్మించాయి. ఆ మూడు అతి ముచ్చటగా ఉండడంతో ఒక్కో గొర్రె పిల్లకు పది లక్షల రూపాయలు చెబుతున్నారు. ఇప్పుడు అక్కడ గొర్రెల అమ్మకానికి మంచి సీజన్. స్విడ్జర్లాండ్‌కు చెందిన ‘వలాయిస్’ గొర్రె జాతి పిల్లలను ఎప్పుడు ఇంగ్లండ్‌కు తీసుకొచ్చి ఆ జాతి బ్రీడ్‌ను రక్షిస్తునారు. ఏడేళ్ల క్రితమే విదేశాలకు గొర్రెల ఎగుమతిని స్విడ్జర్లాండ్ నిషేధించింది. క్రిస్ స్లీ, టామ్ హూపర్ అనే గొర్రెల పెంపకం దార్లు 2016లో వలాయిస్ జాతి గొర్రెల పిండాలను స్కాట్‌లాండ్ నుంచి తీసుకొచ్చి డెవాన్ ఫామ్‌లో పెంచుతున్నారు. డిమాండ్, సరఫరా బట్టి తాము ఈ గొర్రెల ధరను నిర్ణయించినట్లు గతంలో ఆర్థికవేత్తగా పనిచేసిన హూపర్ తెలిపారు. లండన్ మొత్తం మీద ఈ జాతి గొర్రెలు కొన్ని వేలల్లోనే ఉంటాయని, స్విడ్జర్లాండ్ ఎగుమితి నిషేధం కారణంగా ఈ జాతి గొర్రెలు ఎక్కువ కావాలన్నా దొరకవని ఆయన చెప్పారు.
పది లక్షలకు ఓ గొర్రె పిల్ల
Published Tue, Feb 4 2020 5:59 PM | Last Updated on Tue, Feb 4 2020 6:03 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment