Lamb
-
డేగకు చిక్కిన కూన..ఇది కదరా ఆకలి..!
-
ఐదు కొమ్ముల వింత గొర్రె.. యుగాంతానికి సంకేతమంటున్న నెటిజన్లు
లాగోస్: సాధారణంగా గొర్రెకు రెండే కొమ్ములు ఉంటాయి. అయితే, నైజీరియాలోని ఓ గొర్రెకు ఐదు కొమ్ములు ఉండటంతో ప్రజలు దాన్ని వింతగా చూశారు. వివరాల్లోకి వెళితే.. జులై 21న బక్రీద్ పర్వదినం సందర్భంగా నైజీరియాలోని లాగోస్ మార్కెట్లో గొర్రెల విక్రయం జోరుగా సాగింది. ఈ సందర్భంగా ఓ వ్యక్తి తీసుకొచ్చిన గొర్రె అందరినీ ఆకర్షింది. ఆ గొర్రెకు ఐదు కొమ్ములు ఉండటంతో ప్రజలు దాన్ని వింతగా చూశారు. నెత్తి మీద కిరీటం పెట్టినట్లుగా ఆ గొర్రె కొమ్ములు భలే అందంగా ఉన్నాయి. Watch a rare ram with five horns in Lagos, Nigeria pic.twitter.com/6WmkrqeEq4 — Reuters (@Reuters) July 21, 2021 దీంతో చుట్టుపక్కల ప్రజలు దాన్ని చూసేందుకు ఎగబడ్డారు. కొందరు ఆ గొర్రెను ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ కిరీటం తరహాలో ఆ గొర్రె కొమ్ములు భలే ఉన్నాయని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే ఇది యుగాంతానికి సంకేతమని అంటున్నారు. ఈ ఐదు కొమ్ముల గొర్రె భూమిని అంతం చేసేందుకు పుట్టిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
వైరల్ గా మరీనా గొర్రె పిల్లల అల్లరి
-
పది లక్షలకు ఓ గొర్రె పిల్ల
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ దేశంలో కుక్కల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. విదేశాల్లో కుక్కలతోపాటు పిల్లులను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. పిల్లలాగే అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. దేశ, విదేశాల్లో గొర్రెలను కూడా పెంచుకుంటారు. పెరిగి పెద్దదయ్యాక కోసుకొని దాని మాంసం ఆరగించేందుకే. అయితే నల్ల ముక్కు కలిగిన స్విడ్జర్లాండ్‌కు చెందిన ‘వలాయిస్’ జాతి గొర్రె పిల్లలను లండన్ లాంటి దేశాల్లో పెంపుడు కుక్కల వలె పెంచుకుంటారు. అందుకు కారణం ప్రపంచ గొర్రెల జాతుల్లోకెల్లా అవి అత్యంత అందంగా ఉండడమే. ఆ జాతికి చెందిన ఓ గొర్రె పిల్ల భారతీయ కరెన్సీలో ఆరున్నర లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు పలుకుతుంది. అంటే మామూలు గొర్రె పిల్లలకన్నా వాటి ధర దాదాపు 40 రెట్లు ఎక్కువ. ఈ జాతి గొర్రె పిల్లల నుంచి ఉన్ని ఎక్కువ రావడమే కాకుండా మాంసం కూడా బలే రుచిగా ఉంటుందట. ఇంగ్లండ్‌లోని ఉత్తర డెవాన్‌లో వారం క్రితం ఈ జాతికి చెందిన మూడు గొర్రె పిల్లలు ఫామ్‌లో జన్మించాయి. ఆ మూడు అతి ముచ్చటగా ఉండడంతో ఒక్కో గొర్రె పిల్లకు పది లక్షల రూపాయలు చెబుతున్నారు. ఇప్పుడు అక్కడ గొర్రెల అమ్మకానికి మంచి సీజన్. స్విడ్జర్లాండ్‌కు చెందిన ‘వలాయిస్’ గొర్రె జాతి పిల్లలను ఎప్పుడు ఇంగ్లండ్‌కు తీసుకొచ్చి ఆ జాతి బ్రీడ్‌ను రక్షిస్తునారు. ఏడేళ్ల క్రితమే విదేశాలకు గొర్రెల ఎగుమతిని స్విడ్జర్లాండ్ నిషేధించింది. క్రిస్ స్లీ, టామ్ హూపర్ అనే గొర్రెల పెంపకం దార్లు 2016లో వలాయిస్ జాతి గొర్రెల పిండాలను స్కాట్లాండ్ నుంచి తీసుకొచ్చి డెవాన్ ఫామ్‌లో పెంచుతున్నారు. డిమాండ్, సరఫరా బట్టి తాము ఈ గొర్రెల ధరను నిర్ణయించినట్లు గతంలో ఆర్థికవేత్తగా పనిచేసిన హూపర్ తెలిపారు. లండన్ మొత్తం మీద ఈ జాతి గొర్రెలు కొన్ని వేలల్లోనే ఉంటాయని, స్విడ్జర్లాండ్ ఎగుమితి నిషేధం కారణంగా ఈ జాతి గొర్రెలు ఎక్కువ కావాలన్నా దొరకవని ఆయన చెప్పారు. -
చాల్స్ లాంబ్
ఇప్పుడు మనం ‘వ్యాసం’గా భావిస్తున్నది సాధారణంగా రాజకీయ వ్యాసమే. కానీ ఈ అర్థంలోకి స్థిరపడకముందు వ్యాసం ఒక సాహిత్య ప్రక్రియ. 19వ శతాబ్దపు గొప్ప ఎస్సేయిస్టు చాల్స్ లాంబ్ (1775–1834). ఇంగ్లండ్‌లో జన్మించాడు. ఒంటరి పిల్లాడు. పదకొండేళ్లు పెద్దదైన అక్క, రచయిత్రి మేరీ లాంబ్ దగ్గర తొలుత చదువుకున్నాడు. చాలాకాలం ఈస్ట్ ఇండియా హౌజ్‌లో గుమస్తాగా పనిచేశాడు. మేరీతో కలిసి టేల్స్ ఫ్రమ్ షేక్స్పియర్ రాశాడు. 1820లో ఏలియా అనే కలంపేరుతో ఒక లండన్ మేగజైన్‌కు వ్యాసాలు రాయడం మొదలుపెట్టాడు. వాటిల్లో జ్ఞాపకాల వెచ్చదనం, మేధో చమత్కారం, అంతరంగ కలబోత, కలగలిసి ఉంటాయి. ‘ఎస్సేస్ ఆఫ్ ఏలియా’ పేరుతో రెండు భాగాలుగా ఈ పుస్తకాలు వచ్చాయి. చాల్స్ కవి కూడా. అలాగే ఆయన ఉత్తరాలు కూడా సంకలనాలుగా వచ్చాయి. లాంబులు వర్ధిల్లాలనే ఆశయంతో ఇంగ్లండ్‌లో నెలకొల్పిన క్లబ్ ఒకటి 140 ఏళ్లుగా కొనసాగుతోంది. -
గొర్రె పిల్లను కాపాడబోయి కాపరి మృతి
సాక్షి, అల్గునూర్(మానకొండూర్) : ఉపాధి పొందు తున్న గొర్రెను కాపాడబోయి గొర్రెల కాపరి ప్రాణాలు కోల్పోయిన ఘటన తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో బుధవారం చోటు చేసుకుంది. రామకృష్ణకాలనీ పంచాయతీ పరిధిలోని చర్లపల్లికి చెందిన ఆవుల రాజయ్య(45) గొర్రెలు పెంచుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజువారీలాగే బుధవారం ఉదయం గొర్రెలను మేపెందుకు గ్రామశివారుకు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం ఓ గొర్రెపిల్ల మేత కోసం సమీపంలోని బావిదగ్గరకు వెళ్లి.. అందులోనే పడిపోయింది. గమనించిన రాజయ్య వెంటనే తన కొడుకులకు ఫోన్ చేయగా.. వారు తాడు తీసుకొచ్చారు. తాడుసాయంతో బావిలోకి దిగిన రాజయ్య మొదట గొర్రెపిల్లను పైకి పంపించాడు. తర్వాత అదే తాడుసాయంతో పైకి వస్తుండగా అదుపుతప్పి పడిపోయాడు. తాడును నడుముకు కట్టుకోవడంతో బావిలోనే తిరుగుతూ బావి అంచులకు తాకడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. బావిలో నీళ్లు లేకపోవడం కూడా గాయాల తీవ్రతకు కారణమయ్యాయి. బావిలో పడ్డ తండ్రిని ఎంత పిలిచినా స్పందన రాకపోవడంతో వెంటనే గ్రామస్తులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. బావిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న తండ్రిని కాపాడాలంటూ తనయులిద్దరూ బతిమిలాడుతూ రోదించడం కలచివేసింది. గ్రామస్తులు బావి వద్దకు చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్ట్‌మార్టం కోసం కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరు నెలల క్రితం విద్యుదాఘాతం ఆరు నెలల క్రితం రాజయ్యకు చెందిన 18 గొర్రెలు విద్యుదాఘాతంతో మృతిచెందాయి. ఆ సమయంలోనే రాజయ్యకు సైతం కరెంట్‌షాక్ రాగా త్రుటిలో తప్పించుకున్నారు. ఆ సమయంలో ఆర్థికంగా చాలా నష్టపోయాడు. ఆరు నెలల తర్వాత ఉపాధి పొందుతున్న గొర్రెలను కాపాడబోయి ప్రాణాలు పోగొట్టుకోవడం గ్రామస్తులను కలచివేసింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. నిరుపేద రాజయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
గొర్రెల మేధస్సు
పరిపరి శోధన గొర్రెలను బుద్ధితక్కువ జంతువులుగా తీసిపారేస్తాం గానీ, వాటికీ కొంచెం మేధాశక్తి ఉందట! కాస్త ఓపికతో శిక్షణ ఇస్తే మనుషుల ముఖాలను అవి భేషుగ్గా గుర్తుపడతాయని బ్రిటన్‌లోని బబ్రహామ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు చెబుతున్నారు. శిక్షణ ఇచ్చే కాలంలో ముఖాలను గుర్తుపట్టిన గొర్రెలకు నజరానాగా ప్రత్యేక ఆహారం ఇచ్చి చూశామని, దీంతో అవి మరింత ఉత్సాహంగా మనుషుల ముఖాలను గుర్తుపట్టడం మొదలుపెట్టాయని వారు చెబుతున్నారు. దాదాపు యాభై వరకు ముఖాలను అవి తేలికగా గుర్తుంచుకోగలవని అంటున్నారు.