గొర్రెల మేధస్సు
పరిపరి శోధన
గొర్రెలను బుద్ధితక్కువ జంతువులుగా తీసిపారేస్తాం గానీ, వాటికీ కొంచెం మేధాశక్తి ఉందట! కాస్త ఓపికతో శిక్షణ ఇస్తే మనుషుల ముఖాలను అవి భేషుగ్గా గుర్తుపడతాయని బ్రిటన్‌లోని బబ్రహామ్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు చెబుతున్నారు.
శిక్షణ ఇచ్చే కాలంలో ముఖాలను గుర్తుపట్టిన గొర్రెలకు నజరానాగా ప్రత్యేక ఆహారం ఇచ్చి చూశామని, దీంతో అవి మరింత ఉత్సాహంగా మనుషుల ముఖాలను గుర్తుపట్టడం మొదలుపెట్టాయని వారు చెబుతున్నారు. దాదాపు యాభై వరకు ముఖాలను అవి తేలికగా గుర్తుంచుకోగలవని అంటున్నారు.