ఐదు కొమ్ముల వింత గొర్రె.. యుగాంతానికి సంకేతమంటున్న నెటిజన్లు | Sign Of Apocalypse: Rare Five Horned Lamb In Nigeria Prompts Reactions | Sakshi
Sakshi News home page

Viral Video: ఐదు కొమ్ములతో గొర్రె.. యుగాంతానికి సంకేతమంటున్న నెటిజన్లు

Published Thu, Jul 22 2021 7:44 PM | Last Updated on Thu, Jul 22 2021 9:07 PM

Sign Of Apocalypse: Rare Five Horned Lamb In Nigeria Prompts Reactions - Sakshi

లాగోస్‌: సాధారణంగా గొర్రెకు రెండే కొమ్ములు ఉంటాయి. అయితే, నైజీరియాలోని ఓ గొర్రెకు ఐదు కొమ్ములు ఉండటంతో ప్రజలు దాన్ని వింతగా చూశారు. వివరాల్లోకి వెళితే.. జులై 21న బక్రీద్ పర్వదినం సందర్భంగా నైజీరియాలోని లాగోస్‌ మార్కెట్‌లో గొర్రెల విక్రయం జోరుగా సాగింది. ఈ సందర్భంగా ఓ వ్యక్తి తీసుకొచ్చిన గొర్రె అందరినీ ఆకర్షింది. ఆ గొర్రెకు ఐదు కొమ్ములు ఉండటంతో ప్రజలు దాన్ని వింతగా చూశారు. నెత్తి మీద కిరీటం పెట్టినట్లుగా ఆ గొర్రె కొమ్ములు భలే అందంగా ఉన్నాయి. 

దీంతో చుట్టుపక్కల ప్రజలు దాన్ని చూసేందుకు ఎగబడ్డారు. కొందరు ఆ గొర్రెను ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ కిరీటం తరహాలో ఆ గొర్రె కొమ్ములు భలే ఉన్నాయని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే ఇది యుగాంతానికి సంకేతమని అంటున్నారు. ఈ ఐదు కొమ్ముల గొర్రె భూమిని అంతం చేసేందుకు పుట్టిందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement