ఫుట్‌బాల్‌లో పెనాల్టీ కిక్ అంటే అదృష్టం కింద పరిగణిస్తారు. ఎందుకంటే పెనాల్టీ కిక్ సమయంలో ప్రత్యర్థి జట్టు నుంచి గోల్ కీపర్ మినహా మరే ఆటగాడు గోల్‌పోస్ట్ ముంగిట ఉండడు. ఈ అవకాశం వచ్చిన జట్టు పెనాల్టీ కిక్‌ను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. కానీ పెనాల్టీ కిక్‌ను సమర్థంగా ఉపయోగించుకోలేని ఆటగాళ్లు కొందరుంటారు. అదే కావాలని మిస్ చేయడం ఎప్పుడైనా చూశారా. అయితే ఇది చదవండి.
విషయంలోకి వెళితే.. నైజీరియా వేదికగా ఓగున్ స్టేట్ ఎఫ్‌ఏ కప్‌లో భాగంగా ఫైనల్ మ్యాచ్ రోమియో స్టార్స్, ఇజేబూ యునైటెడ్ మధ్య జరిగింది. మ్యాచ్ డ్రాగా ముగియడంతో షూటౌట్ అనివార్యమైంది. షూటౌట్ ఆడేందుకు వచ్చిన ప్లేయర్ వచ్చాడు. గోల్‌పోస్ట్ వైపు కొట్టాల్సిన బంతిని సరిగ్గా వ్యతిరేక దిశలో కిక్ చేశాడు. అంతే చూస్తున్న మనకు షాకింగ్‌గా ఉండొచ్చు.. కానీ వాళ్లకు కాదు. ఎందుకంటే మ్యాచ్ ముందే ఫిక్స్ అయింది కాబట్టి. ఆ తర్వాతి వీడియోతో ఒక క్లారిటీ వచ్చింది. తరువాత షూటౌట్ చేయడానికి వచ్చిన ప్లేయర్ ఈసారి నేరుగా బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించగా.. గోల్ కీపర్ మాత్రం అసలేం పట్టనట్లు చూస్తూ ఉండిపోయాడు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు మ్యాచ్ ఫిక్సింగ్ అని. ఈ వీడియో చూసిన నెటిజన్లు వినూత్న కామెంట్లతో రెచ్చిపోయారు.
I do not know what to say! 🤣🤣pic.twitter.com/YSkFJZ2bDU
— Figen (@TheFigen) July 22, 2022
If this isn’t Match Fixing, then I don’t know what it is.
— Ibukun Aluko (@IbkSports) July 14, 2022
Why is Nigerian football like this? Why don’t we ever want progress??
This is Ogun State FA Cup final between Remo Stars and Ijebu United 💔💔
pic.twitter.com/Mef2oU2gd1
Comments
Please login to add a commentAdd a comment