ఒకేసారి పదిమందిని ఓడించాడు! కారణం తెలిస్తే ఫిదా.. | Nigerian Chess Player Plays 10 Games Simultaneously Defeats All Video | Sakshi
Sakshi News home page

ఒకేసారి పదిమందితో ఆడి.. అందరినీ ఓడించి! కారణం తెలిస్తే ఫిదా

Published Thu, Feb 1 2024 12:20 PM | Last Updated on Thu, Feb 1 2024 12:57 PM

Nigerian Chess Player Plays 10 Games Simultaneously Defeats All Video - Sakshi

ఒకేసారి పదిమందితో ఆడి.. అందరినీ ఓడించాడు (PC: X)

Chess Player Plays 10 Games Simultaneously: నైజీరియా చెస్‌ క్రీడాకారుడు టుండే ఒనకోయ తన నైపుణ్యాలతో అభిమానులను ఫిదా చేశాడు. ఒకేసారి పది మందితో చెస్‌ ఆడి.. అందరినీ ఓడించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను టుండే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌ అవుతోంది.

ఈ క్రమంలో టుండే ఈ గేమ్‌ ఆడటానికి గల అసలు కారణాన్ని తెలుసు​కున్న నెటిజన్లు అతడి మంచి మనసును కొనియాడకుండా ఉండలేకపోతున్నారు. నైజీరియాకు చెందిన టుండే ఒనకోయ చెస్‌ ప్లేయర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

తన ప్రతిభను ప్రపంచానికి చాటుకోవడానికే పరిమితం కాకుండా.. ‘చెస్‌ ఇన్‌ స్లమ్స్‌’ అనే ఫౌండేషన్‌ స్థాపించి పేద విద్యార్థులకు సాయం చేస్తున్నాడు. సామాజిక అంతరాలను తగ్గించే క్రమంలో చెస్‌ను ఒక మాధ్యమంగా ఉపయోగించుకుంటూ.. ఆటపై మక్కువ ఉన్న చిన్నారులకు మెళకువలు నేర్పిస్తున్నాడు.

కేవలం ఆట వరకే తన శిక్షణను పరిమితం చేయకుండా.. జీవిత పాఠాలు, సమస్యలు ఎదురైనపుడు సహనంగా, ఓర్పుగా వాటిని పరిష్కరించుకోవడం వంటి విషయాలు నేర్పుతూ వారిలో సానుకూల దృక్పథం పెంపొందిస్తున్నాడు టుండే ఒనకోయ. తాజాగా పది మందితో ఒకేసారి చెస్‌ ఆడాలన్న ఈవెంట్‌ కూడా ఫండ్‌ రైజింగ్‌లో భాగంగా నిర్వహించినదే.

ఈ చెస్‌ ఎగ్జిబిషన్‌ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వంద మంది విద్యార్థుల చదువుకు సాయం చేసేందుకు వినియోగిస్తామని టుండే ఒనకోయ సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. రెండు గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తాను పది మందిని ఒకేసారి ఓడించడం సంతోషంగా ఉందన్నాడు. జనవరి 17 నాటి ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

చదవండి: Sachin Tendulkar: వరుసగా రెండుసార్లు డకౌట్‌.. సాకులు చెప్పా.. ఆ ఒక్క పరుగు వల్ల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement