పొట్టేలు గాంభీర్యం
‘మేకపోతు గాంభీర్యం’గురించి వినే ఉంటారు. కానీ ఇక్కడ ఓ గొర్రెపోతు (పొట్టేలు) దర్పం చూశారా..! ఎంచక్కా బైక్‌పైకి ఎక్కింది. బండి డ్రైవ్ చేస్తున్నట్టుగా కాసేపు ఫోజిచ్చింది. కొద్దిసేపు స్థానికులను తన చేష్టలతో అలరించి.. బైక్ దిగిపోయింది. ఈ దృశ్యం బయ్యారం మండలంలోని బాలాజీపేటలో బుధవారం చోటుచేసుకుంది. - బయ్యారం