మందలో నాకే పే........ద్ద కొమ్ములు
దొర్నిపాడు: వర్షాలు కురుస్తుండటంతో పొలాల్లో ఖరీఫ్ పనులకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన గొర్రెకాపరులు స్వగ్రామాలకు తమ మందలతో తిరుగు పయనమయ్యారు. డబ్ల్యూ.గోవిందిన్నె, చాకరాజువేముల గ్రామాల నుంచి మందలు వెళ్తుండగా అందులో ఓ పొట్టేలు ‘మా మందలో నాకే పే....ద్ద కొమ్ములు ఉన్నాయి’ అనేలా గంభీరంగా కనిపించింది. నిజమేనా అని కాపరిని ఆరా తీయగా ‘అవును ఒక్కో కొమ్ము అడుగున్నర పొడవు ఉంది. మిగతా వాటికి ఉన్నప్పటికీ దీనంత పొడవు లేవు. సంతానోత్పత్తి కోసం ఇలాంటి పొట్టేళ్లు పెంచుతున్నాం. ఊళ్లలో నుంచి వెళ్తున్నప్పుడు ప్రజలు ఈ పొట్టేలును వింతగా చూస్తుంటారు’ అని కాపరి తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment