సాక్షి,హైదరాబాద్ : గొర్రెల స్కాం దర్యాప్తులో ఏసీబీ దూకుడు పెంచింది. గొర్రెల పంపిణీపై వివరాలు కావాలని తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్యకు లేఖ రాసింది. ఆ లేఖలో లబ్దిదారులు, అమ్మకం దారుడి వివరాలు, బ్యాంక్ అకౌంట్లు, డేటా ఆఫ్ గ్రౌండింగ్,ట్రాన్స్ పోర్ట్, ఇన్ వాయిస్‌లతో కూడా డేటా కావాలని ఆదేశించింది.
ఇప్పటికే గొర్రెల స్కాంపై ఈడీ కేసు నమోదు చేసింది. స్కీంకు సంబంధించిన సమగ్ర నివేదిక కావాలని కోరింది. అయితే ఇప్పటివరకు ఈడీకి నివేదిక అందలేదని తెలుస్తోంది.
ఈడీ,ఏసీబీ లేఖలతో తలలు పట్టుకోవడం అధికారుల వంతైంది. దర్యాప్తు సంస్థల ఆదేశాలతో అధికారులు గొర్రెల స్కాంకు సంబంధించి వివరాల్ని సేకరించేందుకు సిద్ధమయ్యారు. ఆయా జిల్లాల వారీగా కలెక్టర్లకు లేఖలు రాస్తున్నారు.
రూ.1000 కోట్ల అక్రమాలు జరిగినట్టు
రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీలో రూ.1000 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. గొర్రెల పంపిణీలో భాగంగా మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు.. తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment