Owner Rejects Rs 1 Crore Offer For His Lamb With Holy Number 786, See Details - Sakshi
Sakshi News home page

స్పెషల్‌ గొర్రె.. కానీ, ఓనర్‌ రాజు కోట్లు ఇచ్చినా అమ్మేయడంట! ఎందుకో చదివేయండి

Published Thu, Jun 29 2023 7:33 AM | Last Updated on Thu, Jun 29 2023 9:18 AM

Owner Rejects Crores For His Rajasthan Lamb With Holy Number - Sakshi

చాలాకాలం కిందట సోషల్‌ మీడియాలో ఒక వీడియో విపరీతంగా వైరల్‌ అయ్యింది. బహుశా పాకిస్తాన్‌ నుంచి అనుకుంటా.. తనను దూరం చేయొద్దంటూ ఓ మూగజీవి తన ఓనర్‌ను బతిమాలినట్లు ఉన్న వీడియో నెట్‌లో ట్రెండ్‌ అయ్యింది. అయితే.. కుటుంబం గడవడానికి ఆ యజమానిని దానిని అమ్మేయక తప్పలేదు. కానీ, ఇక్కడో గొర్రెల ఓనర్‌ మాత్రం అలా కాదు. కోటి రూపాయలు ఇచ్చినా కూడా తన మందలోని ఆ గొర్రెను మాత్రం అమ్మేయడంట. 

రాజస్థాన్‌ చురూ జిల్లాలో  ఏడాది వయసున్న ఓ గొర్రె పిల్ల.. ఏకంగా కోటి రూపాయలకు పైగా రేటు పలుకుతోంది. అలాగని అదేం భారీ సైజులో లేదు. కానీ, దాని ఓనర్‌ రాజు సింగ్‌కు మాత్రం అది ఎంతో ప్రత్యేకమంట. అందుకే ఇంట్లోకి తెచ్చి మరీ పెంచుకుంటున్నాడు దానిని. కోటి కాదు కదా.. వందల కోట్లు ఇచ్చినా అమ్మేయడంట. అందుకు కారణం ఉంది. 

రాజు సింగ్‌ను స్థానికంగా గొర్రెల రాజు అని పిలుస్తారు. తన మందలోని గొర్రెలను వారాంతపు సంతలో అమ్మేస్తుంటాడతను. అయితే రాజు ఒకరోజు ఆ ప్రత్యేకమైన గొర్రె పొట్ట భాగంలో ఏదో అక్షరాల మాదిరి ఉండడం గమనించాడట. అది ఉర్దూ భాషగా కొందరు చెప్పడంతో.. తన ఊరిలోని ముస్లిం పెద్దలను సంప్రదించాడతను. అది 786 నెంబర్‌ అని.. తమ పవిత్రమైన నెంబర్‌ అని ముస్లిం పెద్దలు చెప్పడంతో రాజు సింగ్‌ దానిని అమ్మకూడదని నిర్ణయించుకున్నాడట. బక్రీద్‌ సందర్భంగా ఆ గొర్రెకు లక్షల నుంచి కోటి దాకా డిమాండ్‌ వెళ్లినా.. రాజు సింగ్‌ మాత్రం ఆ గొర్రెను అమ్మేయడానికి సిద్ధంగా లేడు.

అల్లా ముస్లిం దేవుడు. కానీ, దేవుడి దయ తమ కుటుంబంపై ఉంటుందనే ఉద్దేశంతో ఆ గొర్రెను తన ఇంట్లోకి తెచ్చి మరీ పెంచుకుంటున్నాడు రాజు సింగ్‌. అంతేకాదు.. దానిని దానిమ్మలు, బొప్పాయిలు, మిల్లెట్లు పెట్టి అపరూపంగా చూసుకుంటున్నాడు. రిస్క్‌ రేటు ఎక్కువగా ఉండడంతో.. దానిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. అలా.. స్థానికంగా సెలబ్రిటీ గొర్రెగా మారిపోయిందది.

ఇదీ చదవండి: ఒకే వేదికపై రెండు పెళ్లిళ్లు.. అంతలో షాక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement