అల్పకా... అచ్చంగా మన గొర్రే!... | Alpacas packing Keystone Centre | Sakshi
Sakshi News home page

అల్పకా... అచ్చంగా మన గొర్రే!...

Published Sun, Apr 26 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM

అల్పకా... అచ్చంగా మన గొర్రే!...

అల్పకా... అచ్చంగా మన గొర్రే!...

ప్లే టైమ్
అల్పకా ప్రధానంగా దక్షిణ అమెరికా దేశాల్లోనూ, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కనిపించే జంతువు.  శీతల వాతావరణంలో పెరగడం వల్ల దాని రూపంలో మార్పు కనిపిస్తోంది. కానీ ఇది అచ్చం మన గొర్రెను పోలిన జంతువే. మన దగ్గర గొర్రెల ఉన్నికి, మాంసానికి గిరాకీ ఉన్నట్లే... చిలీ, ఈక్వెడార్, బొలీవియా, పెరూ వంటి దేశాల్లోనూ అల్పకాల మాంసానికి, ఉన్నికి డిమాండ్ ఎక్కువ. అక్కడి ప్రజలు దీన్ని పెంపుడు జంతువుగా, వాణిజ్య జంతువుగా పెంచుకొంటారు.

వీటి ఉన్నితో స్వెటర్లు, టోపీలు, గ్లోవ్స్ చేస్తారు. పెరూ దేశంలో పెరిగే అల్పకా నుంచి 52 రంగుల ఉన్ని లభిస్తుంది. సహజరంగుల్లో లభించే ఉన్ని కాబట్టి, ఈ ఉన్నికి వస్త్ర పరిశ్రమలో డిమాండ్ ఎక్కువ. అల్పకాలు 48 నుంచి 84 కేజీల బరువు పెరుగుతాయి. జీవనశైలి, ఆహారం విషయంలోనూ అరుపులోనూ ఇవి గొర్రెలనే గుర్తు చేస్తాయి. వీటిల్లో పోతులు (మగవి) మన పొట్టేళ్లలాగానే పొడుస్తూ దాడికి దిగుతాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement