
శస్త్రచికిత్స అనంతరం రెండు తలలున్న గొర్రె పిల్ల
సంతబొమ్మాళి : మండలంలోని వెంకటాపురం గ్రామంలో గొర్రెల కాపరి బెండి గడ్డెన్నకు చెందిన గొర్రె రెండు తలలు ఉన్న పిల్లకు సోమవారం జన్మనిచ్చింది. గొర్రె సాధారణ ఈతకు ప్రయత్నించినా విఫలం కావడంతో సంతబొమ్మాళి పశువుల ఆస్పత్రికి తరలించారు. పశువైద్యాధికారి కిరణ్‌కుమార్ శస్త్రచికిత్స చేసి రెండు తలలు, ఒకే మొండెంతో చనిపోయి ఉన్న గొర్రె పిల్లను బయటకు తీశారు. జన్యుపరమైన లోపం వల్ల పిండం ఏర్పడే దశలో అవయవాలు సక్రమంగా ఏర్పాటు కాలేదని, దీని కారణంగానే ఇటువంటి పిల్లలు జన్మిస్తాయని ఆయన తెలిపారు.