
తల చినదే జరిగినిదా..
మన పూర్వీకులు ‘గొర్రె తోక బెత్తెడు’ అన్నారు గాని.. దాని బుర్రలో ఎంత గుంజు ఉందో చెప్పలేదు.
మన పూర్వీకులు ‘గొర్రె తోక బెత్తెడు’ అన్నారు గాని.. దాని బుర్రలో ఎంత గుంజు ఉందో చెప్పలేదు. ఈ చిత్రంలో గొర్రె చేసిన పని చూస్తే దాని బుర్ర కూడా బెత్తెడుకు మించి ఉండదనిపిస్తుంది. తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలోని లలితానగర్‌లో ఒక గొర్రె మంచినీటి కోసం బిందెలో తల పెట్టింది. పాపం అందులో తల ఇరుక్కుపోవడంతో బయటకు తీసుకోలేక నానాపాట్లు పడింది. దీని అవస్థలు చూసి స్థానికులు శతవిధాలా ప్రయత్నించి ఎట్టకేలకు అతికష్టం మీద బిందెలోంచి గొర్రె తల బయటకు తీశారు. దీంతో తలచినిదా జరిగినిదా దైవం ఎందులకు అనుకుంటూ తిరుగుముఖం పట్టింది.
- తణుకు