Moosarambagh Bridge Closed Due to Flood Water At Hyderabad - Sakshi
Sakshi News home page

వరద నీటిలో మునిగిన మూసారంబాగ్‌ బ్రిడ్డి

Published Wed, Jul 27 2022 9:10 AM | Last Updated on Wed, Jul 27 2022 10:41 AM

Musarambagh Bridge Submerged In Flood Water At Hyderabad - Sakshi

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో మూసి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో, హైదరాబాద్‌లోని మూసారంబాగ్‌ బ్రిడ్డి వరద నీటిలో మునిగిపోయింది. ఇక, చాదర్‌ఘాట్‌లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి కాలనీలు నీటమునిగాయి.

ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో, వాహనదారులను అలర్ట్‌ చేస్తూ వేరే రూట్స్‌లో వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉండగా.. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ 12 గేట్లు, ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తారు. ఈ క్రమంలో మూసీలోకి వరద పోటెత్తింది. 

ఇది కూడా చదవండి: వానల ఎఫెక్ట్‌: తెలంగాణలోని ఆ జిల్లాలో స్కూల్స్‌ బంద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement