rainstorms
-
వరద నీటిలో మునిగిన మూసారంబాగ్ బ్రిడ్డి
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో మూసి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో, హైదరాబాద్‌లోని మూసారంబాగ్ బ్రిడ్డి వరద నీటిలో మునిగిపోయింది. ఇక, చాదర్‌ఘాట్‌లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి కాలనీలు నీటమునిగాయి. #HYDTPinfo Commuters, please make a note that due to the overflow of the Musi River on Jiyaguda 100ft road, the route is temporarily closed and traffic is diverted. @JtCPTrfHyd pic.twitter.com/nPofNIOVx8 — Hyderabad Traffic Police (@HYDTP) July 26, 2022 ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా, ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో, వాహనదారులను అలర్ట్ చేస్తూ వేరే రూట్స్‌లో వెళ్లాలని సూచించారు. ఇదిలా ఉండగా.. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ 12 గేట్లు, ఉస్మాన్ సాగర్ 8 గేట్లు ఎత్తారు. ఈ క్రమంలో మూసీలోకి వరద పోటెత్తింది. హియామత్ సాగర్ ORR సర్వీస్ రోడ్డు బ్రిడ్జి మధ్యలో చిక్కుకున్న యువకుడిని కాపాడిన ట్రాఫిక్ పోలీసులు. ప్రవహిస్తున్న వాగుల నుండి వాహనాలు తీసుకెళ్లడం, నడుచుకుంటూ దాటకండి. pic.twitter.com/e3NCPyVvUT — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) July 26, 2022 ఇది కూడా చదవండి: వానల ఎఫెక్ట్: తెలంగాణలోని ఆ జిల్లాలో స్కూల్స్ బంద్ -
వానల ఎఫెక్ట్: తెలంగాణలోని ఆ జిల్లాలో స్కూల్స్ బంద్
సాక్షి, వికారాబాద్: తెలంగాణలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా వికారాబాద్, పూడూరు మండలాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. మూసీవాగు, కాగ్నానది ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలు స్తంభించాయి. గత 24 గంటల్లో అత్యధికంగా కందవాడలో 13.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 4.95 సెం.మీ. నమోదైంది. ప్రధాన ప్రాజెక్టులు శివసాగర్, నందివాగు, జుంటుపల్లి, కోట్‌పల్లి, లఖ్నాపూర్, సర్పన్‌పల్లి తదితర ప్రాజెక్టులు పూర్తిస్థాయి నిండి అలుగు పారు తున్నాయి. తాండూరుకు అన్ని వైపుల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. వందల ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. కలెక్టర్ కార్యాలయం లోతట్టు ప్రాంతంలో ఉండటంతో ప్రాంగణం మొత్తం నీటితో నిండిపోయింది. కాగా, భారీ వర్షాల కారణంగా వికారాబాద్ జిల్లాలో విద్యాసంస్థలు అన్నింటికీ కలెక్టర్ నిఖిల బుధవారం సెలవు ప్రకటించారు. కాగా, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో అత్యధికంగా 9.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల పంటపొలాలు, ఇళ్లు జలదిగ్బంధం అయ్యాయి. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు వరద నీరు పోటెత్తింది. ఈ క్రమంలో అధికారులు గండిపేట్, ఉస్మాన్‌సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇది కూడా చదవండి: అర్ధరాత్రి నుంచి దంచికొడుతున్న వాన.. మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్ -
భారీ వర్షాల ఎఫెక్ట్.. ఐదు జిల్లాల్లో స్కూల్స్, కాలేజీలు బంద్
దేశవ్యాప్తంగా కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలకు దాదాపు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా మంగళవారం అనేక జిల్లాల్లో కొండచరియలు విరిగిపడటం, భారీ వరదలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో వాహనాల రాకపోకలు సాగిస్తున్న ఐదు రహదారులను అధికారులు మూసివేశారు. ఇక, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులు అప్రమతమయ్యారు. బాగేశ్వర్, తెహ్రీ, పౌరి, పితోరాఘర్, నైనిటాల్ జిల్లాల్లో 1-12వ తరగతి వరకు పాఠశాలలు, అన్ని అంగన్వాడీ కేంద్రాలు బుధవారం మూసివేసినట్టు తెలిపారు. ఇక, డెహ్రాడూన్, టెహ్రీ, పౌరీ, నైనిటాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్, హరిద్వార్ జిల్లాలకు జూలై 20న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. #WATCH उत्तराखंड: बारिश की वजह से टनकपुर में एक स्कूल बस पानी के तेज़ बहाव में बह गई। pic.twitter.com/BQYlA7dqVb — ANI_HindiNews (@AHindinews) July 19, 2022 ఇదిలా ఉండగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మంగళవారం జోషిమత్‌లోని పుర్సరి వద్ద జాతీయ రహదారి ఎన్‌హెచ్-58 కుంగిపోయింది. దీంతో, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ ప్రకటిచింది. Only driver was present in the bus at the time of the incident on Tuesday morning. #Champawat #UttarakhandRains pic.twitter.com/wQ4GYwiuag — TOI Cities (@TOICitiesNews) July 19, 2022 -
TS: గోదారమ్మ ఉగ్రరూపం.. మంత్రిపై వరద బాధితుల ఆగ్రహం
గోదావరి వరద ఉధృతి కారణంగా భద్రాచలం నీట మునిగింది. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో నివాసితులు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్బంగా వరద బాధితులు ఆందోళనకు దిగారు. కరకట్ట పొడిగింపుపై హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి సుభాష్ నగర్ వరకు కరకట్టను పొడగించాలని నినాదాలు చేశారు. వరదల్లో చిక్కుకున్న తమకు తాగేందుకు నీరు కూడా లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కట్టుబట్టలతో రోడ్డున పడ్డామని కన్నీంటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మంత్రి వచ్చి ఫొటోలు తీసుకుని వెళ్లిపోయారు. సమస్యలు మాత్రం పరిష్కరించలేదు. కరకట్ట పొడిగించి తమకు న్యాయం చేయాలన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే వీరయ్య వరద బాధితులకు మద్దతు తెలిపారు. ఇక, అధికారులు సుభాష్ నగర్ ప్రజలతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు.. గోదారమ్మ కొంచెం శాంతించింది. ప్రస్తుతం గోదావరి వరద ప్రవాహం భద్రాచలం వద్ద 70.3 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. కానీ, మూడో ప్రమాద హెచ్చరిక మాత్రం కొనసాగుతోంది. మరో 24 గంటలు కీలమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: రైలులో భద్రాచలానికి గవర్నర్ తమిళిసై.. అటు సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే -
అదిరిందయ్యా చంద్రం.. పడవలో వధువు, థర్మోకోల్ షీట్‌పై వరుడు..
దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే పెళ్లి వేడుకల వంటి శుభాకార్యాలకు ముహుర్తాలు ఉండటంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా,గురువారం కోనసీమ జిల్లాలోని లంకపేటకు చెందిన వధువు నల్లి ప్రశాంతి.. కూడా పడవలో వెళ్లి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమయంలో ఇలాంటి మరో ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో రోడ్డు మార్గంలో ప్రయాణం చేయలేని వరుడు పెద్ద సాహసమే చేశాడు. హడ్గావ్ మండలం కొర్రి గ్రామానికి చెందిన ఓ వరుడు పెళ్లి కోసం థర్మకోల్ షీట్ సాయంతో 7 కిలోమీటర్ల దూరంలోని ఉమర్‌ఖేడ్ మండలం సంగమ్ చించోలి వరకు నీటిలో ప్రయాణించాడు. అతడితో పాటు బంధువులు సైతం థర్మకోల్ షీట్ల సాయంతోనే వివాహానికి వెళ్లారు. అనంతరం పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. आम्ही लग्नाळू:गुडघ्याला बांशिग बांधून पुराच्या पाण्यात थर्माकॉलवरून निघाली वरात; नवरदेवाचा 7 किमी नदीमार्गे प्रवास#nanded #marriage #flood #monsoon2022 #HeavyRains https://t.co/sjydoCUumU आणखी बातम्यांसाठी इन्स्टॉल करा दिव्य मराठी अॅपhttps://t.co/Jec3P7FpPp pic.twitter.com/q7wIx6yYEI — Divya Marathi (@MarathiDivya) July 15, 2022 ఇదిలా ఉండగా.. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంక లంకపేటకు చెందిన నల్లి ప్రశాంతికి, మలికిపురం మండలం కేశనపల్లికి చెందిన గంటా అశోక్‌కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. గురువారం ఉదయం పెళ్లి కావాల్సి ఉండగా.. పెదపట్నంలంకను గోదావరి వరద చుట్టు ముట్టింది. ఈ నేపథ్యంలో అష్టకష్టాలు పడి పెళ్లి కుమార్తెను అతి ముఖ్యులతో కలిసి పడవపై అప్పనపల్లి కాజ్వే వరకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి కారులో కేశనపల్లికి చేరుకున్నారు. ముహూర్త సమయానికి కాస్త ఆలస్యమైనా పెళ్లి వేదిక వద్దకు చేరుకోగలిగారు. అనంతరం పెద్దలు పెళ్లి ప్రక్రియ పూర్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Bride and family were not going to let the rains spoil the party; so, clad in silk finery, they set off in boats to the groom's place, making their way through coconut groves !! #Godavari receiving huge surplus waters #AndhraPradesh #Konaseema @ndtv @ndtvindia #AshokWedsPrashanti pic.twitter.com/viytS8jUJ2 — Uma Sudhir (@umasudhir) July 15, 2022 -
భారీవర్షంతో అతలాకుతలం
సాక్షి, నెట్వర్క్ : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రెండురోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు, వాగు లు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాల్లో పంటపొలాలు, పట్టణాల్లో లోత ట్టు ప్రాంతాలతోపాటు రోడ్లు జలమయమయ్యాయి.వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి ఏడుగురు మృతిచెందారు. వాగుదాటుతూ ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం జల దిగ్బంధమైంది. వందల ఎకరాల్లో పత్తి, మిరప పంటలు నీట ముగియాయి. దాచేపల్లి, కారంపూడి, మాచర్ల, గురజాల తదితర ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. దాచేపల్లి పరిధిలోని నాగులేరు పొంగి ప్రవహించింది. గురువారం ఉదయం ఓ వ్యక్తి వాగునీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా స్థానికులు రక్షించారు. నడికుడి రైల్వేస్టేషన్ సమీపంలో నీటి ప్రవాహ ఉద్ధృతికి పట్టాల కింద ఉన్న కంకర, ట్రాక్ ప్లేట్లు కొట్టుకుపోయాయి. మరమ్మతుల కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కారంపూడిలో నాగులేరు నిండుకుండను తలపించింది. ఎర్రవాగు, తుమ్మలవాగు, కబోదివాగు, రాళ్లబండివాగు ఉద్ధృతి కార ణంగా సమీప పొలాల్లో పంటలు నీట మునిగాయి. గురజాల మండలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామ సమీపంలోని పాలేరు వాగు దాటుతూ విద్యార్థి షణ్ముఖం (14) గల్లంతయ్యాడు. సూర్యాపేటలోని సిద్ధార్థ స్కూల్లోఅతను 9వ తరగతి చదువుతున్నాడు. వరంగల్ జిల్లా కొడకండ్లలోని బయ్యన్నవాగులోకి భారీగా వరదనీరు చేరింది. తొర్రూరు, చిట్యాల, వెలికట్ట, బొమ్మకల్ గ్రామాల్లో చెరువులు అలుగు పోస్తున్నాయి. పత్తి, పెసర పంటలు నీట మునిగాయి. నెల్లికుదురు మండలంలో కాచికల్-ఎర్రబెల్లిగూడెం గ్రామాల మధ్య కల్వర్టు పొంగి ప్రవహిస్తోంది. తొర్రూరు-కేసముద్రం, నెల్లికుదురు-మహబూబాబాద్ మార్గాల మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. నర్సింహులపేటలో పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. డోర్నకల్‌లో మున్నేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. కేసముద్రం మండలం ఇనుగుర్తిలో భారీ వర్షంతో పంటలు కొట్టుకుపోయాయి. కురవి, కేసముద్రం ఎస్సీకాలనీ, డోర్నకల్తోపాటు వరంగల్ నగరంలోని కరీమాబాద్ లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరదనీరు చేరింది. కరీంనగర్ జిల్లాలోని దిగువ మానేరు జలాశయం (ఎల్ఎండీ) పూర్తిస్థాయిలో నిండడంతో గురువారం ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి వరద కాలువ ద్వారా విడుదల చేసిన 6 వేల క్యూసెక్కుల నీరు గురువారం మధ్యాహ్నం ఎల్ఎండీకి చేరడంతో పదోనంబర్ గేటు ఎత్తి రెండువేల క్యూసెక్కుల నీటిని మానేరు నదిలోకి వదిలారు. దిగువ కాకతీయ కాలువకు నీటి విడుదలను నిలిపివేయడంతో శుక్రవారం మరో గేటు ఎత్తే అవకాశముంది. ఖమ్మం జిల్లా వైరా, కూసుమంచి, తిరుమలాయపాలెం, కొణిజర్ల మండలాల పరిధిలో 6 సెంటీమీటర్లు, కొత్తగూడెం, ఖమ్మంలో 5సెంటీమీటర్ల వర్షపాతం పడింది. జలాశాయల్లో భారీగా నీరు చేరుతోంది. పిడుగుపాటుకు ఏడుగురి మృతి ఖమ్మం/శ్రీకాకుళం, న్యూస్‌లైన్: పిడుగుపాటుతో గురువారం ఖమ్మం జిల్లాలో వేర్వేరు ప్రాంతాలలో ఆరుగురు మృతిచెందగా, శ్రీకాకుళం జిల్లాలో మరొకరు మరణించారు. ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాంతండాకు చెందిన భార్యాభర్తలు భూక్యా దీప్లా(38), భూక్యా పద్మ(35) పత్తి చేనుకు మందు వేసేందుకు వెళ్లారు. వర్షం వస్తుండడంతో ఓ చెట్టుకిందకు వెళ్లారు. ఆ సమయంలోనే పిడుగు పడి ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. కొత్తగూడెం మండలం రేగళ్ల శివారు పెద్దతండాకు చెందిన దారవత్ లింగి (35) నాట్లు వేసేందుకు వెళ్లాడు. భారీవర్షంతో ఇంటికి వెళుతుండగా, పిడుగు పడి మృతి చెందాడు. బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామానికి చెందిన బానోతు నాగమణి(28) పత్తిచేలో కలుపు తీస్తుండగా వర్షం మొదలైంది. చెట్టుకిందకు వెళ్లగా, పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందింది. టేకులపల్లి మండలం మంగలితండాలో కౌలురైతు మోకాళ్ల భద్రయ్య (38) పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామానికి చెందిన పశువుల కాపరి సుపావత్ జామ్లా (60) పశువులను మేపుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో పిడుగు పడి, అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం కిరప గ్రామానికి చెందిన పాలక ప్రభాకర్ (18) పిడుగుపాటుకు గురై మృతిచెందాడు.