ఏక్ నంబర్ దో గాడీ | police caught 2 autos with single rigistration number | Sakshi
Sakshi News home page

ఏక్ నంబర్ దో గాడీ

Published Sun, Jan 18 2015 5:57 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

police caught 2 autos with single rigistration number

హైదరాబాద్: ఒకే రిజిస్ట్రేషన్ నంబరుతో తిరుగుతున్న రెండు ఆటోలను ఆదివారం ఆబిడ్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని, ఆటోయజమానిని అరెస్టు చేశారు. ఏపీ 11 వై 8876 నంబరుతో ఆటో రిజిస్ట్రేషన్ చేయించి అదే నంబరుతో రెండు ఆటోలను నడుపుతున్న వారి ఆటకట్టించడానికి రంగంలో దిగిన పోలీసులకు కఠోరమైన నిజాలు తెలిశాయి.

 ఇది కేవలం ఒక ఆటోకు సంబంధించిన విషయం కాదని దీని వెనక పెద్ద మాఫియా ఉందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో నగర పరిధిలో ఇలాంటి సంఘటనలు ఎక్కువవుతుండటంతో పోలీసులు వీటిపై దృష్టి సారించారు. దీని వెనక పాతబస్తీకి చెందిన ముఠా ఉన్నట్లు ప్రాథమిక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. తాజా ఘటనలో ఆటో ఓనర్‌తో పాటు ఈ ముఠాకు చెందిన ఇద్దరు వ్యక్తులను చాదర్ ఘాట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement