సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చాదర్‌ఘాట్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గానా బజానా, బాణాసంచాలో సిబ్బంది హంగామా చేశారు. వచ్చే నెలలో డాక్టర్ కూతురు వివాహం ఉండటంతో ముందస్తుగానే ఆసుపత్రి బిల్డింగ్‌పై పార్టీ చేసుకున్నారు. డీజేలతో డ్యాన్స్‌లు చేస్తూ ఆసుపత్రి సిబ్బంది వేడుకల్లో మునిగిపోయారు.
ఈ సమయంలో పురిటి నొప్పులతో ఓ గర్భిణి ఆసుపత్రిలో చేరింది. మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసినా.. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు. పార్టీలో లీనమై ఎంజాయ్ చేశారు.ఈ క్రమంలో శిశువు మృతిచెందింది. తల్లి ఆరోగ్యం కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు.. శిశువు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ముందు నిరసనలకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. మృతి చెందిన శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. సదరు ఆసుపత్రిపై కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఆమ్నేషియా పబ్ కేసులో మరో ట్విస్ట్..
Comments
Please login to add a commentAdd a comment