
సైకో దాడిలో గాయపడిన పోలీసులు
హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఏకంగా పోలీసులపైనే దాడి చేశాడు. చాదర్‌ఘట్ పోలీస్‌స్టేషన్ పరిధి శంకర్‌నగర్‌కు చెందిన సైకో ఇసామియా.. ఓ ఫంక్షన్‌కు వెళ్లి అక్కడ శివ, బాబులపై కత్తితో దాడి చేశాడు. దీనిపై ఫిర్యాదు అదుకున్న చాదర్‌ఘట్ ఎస్సై మహేష్...కానిస్టేబుల్స్‌ను వెంటబెట్టుకొని ఘటనాస్థలానికి వెళ్లారు.
అయితే ఇసామియా అనూహ్య రీతిలో ఎస్ఐతో పాటు, కానిస్టేబుళ్లపైన కత్తితో దాడి చేశాడు. గాయాలైన ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎట్టకేలకు సైకో ఇసామియాను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.