Physio
-
నిత్యజీవితంలోని పనులే ఫిజియో వ్యాయామాలైతే...
సాధారణంగా పక్షవాతంతో అవయవాలు చచ్చుబడ్డా లేదా ఇతరత్రా ఏదైనా ప్రమాదం కారణంగా అవయవాల్ని కొద్ది రోజులు పని చేయించలేకపో తే... అవి మళ్లీ నార్మల్‌గా పని చేయడానికి ఫిజియోథెరపీ వ్యాయామాలు అవసరమవుతాయి. మునపటిలా పని చేయడానికి ఉపకరిస్తాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో వీటినే రీ–హ్యాబ్ వ్యాయామాలని కూడా అంటారు. వ్యాయామం అనగానే ఏదో శ్రమతో కూడిన పని అనీ, ఎలాగోలా తప్పించుకుంటే బెటరని అనిపించేవాళ్ల సంఖ్యే ఎక్కువ. చాలా సందర్భాల్లో కంప్యూటర్ సహాయంతోనో లేదా రొబోటిక్స్ సహాయంతోనో వినోదాత్మకంగా తీర్చిదిద్దిన వ్యాయామాలూ ఎక్కువగానే ఉంటాయి. ఈ కంప్యూటర్ లేదా రొబోటిక్ పద్ధతుల కంటే మనం రోజూ చేసే పనులనే ‘ఫిజియో’ వ్యాయామ పద్ధతులుగా తీర్చిదిద్దడమే మంచిదనీ, అవే ఎక్కువ మేలు చేస్తాయంటున్నారు కొందరు నిపుణులు. రోజువారీ పనులే ‘ఫిజియో’ వ్యాయామరీతులెలా అవుతాయో తెలుసుకుందాం. ఫిజియోవ్యాయామాలు అనగానే ‘పక్షవాతం’లాంటి స్ట్రోక్‌కు గురై, కోలుకునే ఏ కొందరికి మాత్రమే పరిమితమైనవనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ మన మొత్తం దేశ జనాభాలో... ఆ మాటకొస్తే ప్రపంచ జనాభాలోని 15% మందికి ఫిజియో అవసరమనేది ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా. ఒక్క పక్షవాతం వచ్చిన వారే కాదు, ప్రమాదాలకు లోనై మళ్లీ కోలుకునే క్రమంలో తమ అవయవాలను మునుపటిలా కదిలించడానికీ, కొన్ని జబ్బులతో చాలాకాలం పాటు మంచం పట్టి... ఆ తర్వాత మళ్లీ తమ పనులు యధావిధిగా చేసుకోవాలనుకుంటున్నవారికీ, మోకాళ్ల కీలు మార్పిడి చికిత్సల తర్వాత మళ్లీ మునపటిలా నడవాలనీ, జాగింగ్చేయాలనుకునేవారు... ఇలా ప్రపంచమంతటా కనీసం 100 కోట్ల మందికి రీ–హ్యాబ్ అవసరం. వీళ్లే కాదు... గుండెపో టు వచ్చాక కూడా వ్యాయామాలు అవసరం కానీ అవి గుండెపై ఏమాత్రం భారం మోపకుండా ఉండేంత సున్నితంగా ఉంటూనే... శరీరానికి తగినంత పని చెప్పేంత శ్రమతో ఉండాలి. ఈ సున్నితమైన బ్యాలెన్స్ పాటించేలా వ్యాయామాలు రూపొందించడం, చేయించడం ‘ఫిజియోథెరపిస్ట్’ ల పని. వాటిని సైంటిఫిక్‌గా రూపొందించడం ఎంతో కీలకం. కంప్యూటర్, రొబోటిక్ ఆధారితమైనవి ఎన్నెన్నో... వ్యాయామాల్ని ఉత్సాహంగా చేయడానికి వీలుగా రూపొందించడం కోసం ‘ఫిజియో’లు ఎన్నెన్నో మార్గాలను అన్వేషిస్తుంటారు. ఉదాహరణకు కంప్యూటర్ స్క్రీన్ మీద చుక్కల్ని ఓ వరసలో కలిపి, ఓ ఆకృతి వచ్చేలా చేయడం. లేదా ఏదో టాస్క్‌ని ఓ నిర్ణీత/నిర్దేశిత పద్ధతుల్లో పూర్తి చేయడం వంటివి. ఒక రకంగా చెప్పా లంటే చిన్నపిల్లలు కంప్యూటర్ గేమ్స్ ఆడి విజయం సాధించనప్పటి థ్రిల్ పొందేలా ఈ కంప్యూటర్ లేదా రొబోటిక్ ఆధారిత ఫిజియో(గేమ్స్) పద్ధతులు ఉంటాయి. ఇవి కూడా చాలావరకు మేలే చేస్తాయి. కంప్యూటర్, రొబోటిక్ వ్యాయామాల్లో పరిమితులు అయితే వాటిలో కొన్ని పరిమితులు ఉండేందుకు అవకాశం ఉంది. 2008లో దాదాపు 330 మందిపై జరిగిన ఓ అధ్యయనంలో ఈ సంగతి రుజువైంది. ఏ వ్యాయామ రీతిలోనైనా... భారం ఎక్కువగా పడుతూ, తక్కువ రిపిటీషన్లతో సమకూరే వ్యాయామం కంటే తక్కువ భారం పడుతూ... ఎక్కువ రిపిటీషన్లతో సమకూరే వ్యాయామంలోనే కండరానికి ఎక్కువ సామర్థ్యం అలవడుతుంది. ఇలా బరువును క్రమంగా పెంచుకుంటూ, దానికి అనుగుణంగానే రిపిటీషన్లను పెంచుతూ పో వడం వల్లనే ప్రయోజనం ఎక్కువ అని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అధిగమించడం ఇలా... పైన పేర్కొన్న అధ్యయనం ప్రకారం ఆ పరిమితుల్ని అధిగమించేందుకు కొన్ని దేశీయ పద్ధతులతో వ్యాయామ రీతుల్ని మన నిపుణులు అభివృద్ధి చేశారు. మనం రోజూ చేసే పాత పనుల్నే వ్యాయామ రీతులుగా సరికొత్తగా రూపొందించారు. రొబోటిక్ రీ–హ్యాబ్ ప్రక్రియల్లో కంప్యూటర్ ఆధారంగా కొన్ని డిజైన్లు వచ్చేలా చుక్కల్ని కలపడం, రొబోటిక్ కదలికలతో కండరం బలం పెంచుకున్నా కదలికల నైపుణ్యం తగ్గడం వల్ల ఒనగూరాల్సిన ప్రయోజనం అందదు. కానీ రోజువారీ పనులతో రూపొందించిన పద్ధతులతో చచ్చుబడ్డ కండరానికి బలమూ, నైపుణ్యమూ పెరుగుతాయి. ప్రయోజనమూ ఎక్కువే, స్వావలంబనా సహజమే ఇలాంటి దేశీయ పద్ధతులతో ఓ ప్రయోజనమూ ఉంది. కంప్యూటర్‌పై ఆటలు చిన్నతనంలో ఆసక్తిగా ఉండవచ్చు. కానీ స్ట్రోక్ లాంటివి మధ్యవయసు దాటాకే వస్తుంటాయి. అందువల్ల ఆ వయసులో కంప్యూటర్‌పై రొటీన్ సీక్వెన్సింగ్ పనులు బోర్‌గా అనిపించవచ్చు. కానీ రోజువారీ పనులు చేస్తుండటం, వాటిలో రోజురోజుకూ మెరుగుదల కనిపించడంతో పేషెంట్లకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. పైగా అవి అటు తర్వాత కూడా వారి రోజువారీ జీవితంలో చేసుకోవాల్సిన పనులు కావడంతో స్వావలంబనా, ఎవరిపైనా ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకోగలమన్న ఆత్మవిశ్వాసమూ పెరుగుతాయి. రోజువారీ పద్ధతుల్లో కొన్ని... రోటీలు చేయడం... చచ్చుబడ్డ కండరాల సహాయంతోనే రోటీలు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. రొట్టెలు చేయడంలో అప్పడాల కర్రతో రొట్టెల్ని గుండ్రంగా వచ్చేలా చేయడం. ఇందులో చేతి వేళ్లన్నింటితో పాటు ముంజేయి కండరాలు, మోచేతి కీలు వంటి వాటికి వ్యాయామం సమకూరుతుంది. కూరగాయలు తరగడం పూర్తిగా నైపుణ్యంతో కాకపో యినా... వీలైనంత మేరకు కూరగాయలు తరిగేలా చేయిస్తారు. దాంతో బొటనవేలితో పాటు, కత్తి చుట్టూ మిగతా వేళ్ల గ్రిప్ పెరుగుతుంది. చేయి, ముంజేయి, మోచేతి కండరాలతో పాటు మణికట్టు ఎముకల కదలికలతో చేతికి కావాల్సిన రీ–హ్యాబ్ వ్యాయామం సమకూరుతుంది. ఇది క్రమంగా బలమూ పెంచుతుంది. నైపుణ్యాలను సైతం పెరిగేలా చేస్తుంది. చీర కుచ్చిళ్ల కదలికలతో మహిళల్లో అయితే వారు రీ–హ్యాబ్ కార్యక్రమంలో ఉన్నప్పుడు నైటీ మీదే చీర కట్టుకునేలా ్రపో త్సహించడం. ఈ ప్రక్రియలో చీర కుచ్చిళ్లను అల్లుకునేలా మాటిమాటికీ చేతులు కదిలించేలా చేస్తారు. స్ట్రోక్‌తో చేతుల్లోని, వేళ్లలోని నరాల కేంద్రం దెబ్బతిన్న వారిలో ఈ వ్యాయామ రీతి వల్ల అతి సున్నితమైన వేలి కండరాలు, వేళ్లకు సప్లై అయ్యే నరాల్లో కదలికల్ని క్రమంగా నింపేలా చూస్తారు. తోట పని ప్రక్రియలు మనం తోట పని చేసేప్పుడు గడ్డపారతో తవ్వడం, పార (స్పేడ్) లాంటి పరికరాలతో మట్టిని నిర్దేశిత రీతిలో పో గుపడేలా చేయడం, కిందపడ్డ ఆకుల్ని కాళ్లలో ఓ పక్కకు తోయడం... ఇవన్నీ పూర్తిస్థాయిలో కాకపో యినా... ఆ పనుల్లో కాళ్లూ, చేతులతో ఎలాంటి కదలికలు అవసరమో, అవే జరిగేలా చూస్తారు. ఇక్కడ నైపుణ్యానికి తావు లేకుండా తొలుత ఆసక్తిగా తోట పనిలో పాలు పంచుకునేలా చేస్తుంటారు. క్రమక్రమంగా ఆయా అవయవాలకు బలం సమకూరడమే కాకుండా... నైపుణ్యమూ పెరుగుతుంది. -డాక్టర్ విజయ్ బత్తిన (పీటీ) ఫిజికల్ మెడిసిన్ అండ్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ -
టీమిండియాకు గాయాల బెడద.. ద్రవిడ్ మాస్టర్ ప్లాన్..! ఇకపై...
Rahul Dravid- Team India: టీమిండియా ఆటగాళ్లు వరుసగా గాయాల బారిన పడుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీమిండియా ఫిజియో నితిన్ పటేల్‌ను జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కి అటాచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ప్రమోషన్ ఇచ్చి హెడ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ పదవి ఇవ్వనున్నట్లు వార్తలు వెలువడనున్నాయి. కాగా టీమిండియా స్టార్ ఆటగాళ్లు దీపక్ చహర్, సూర్యకుమార్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి తదితరులు గాయాల బారిన పడి ఎన్సీఏలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. వీరితో పాటు మరికొందరు ప్లేయర్లు కూడా అక్కడే శిక్షణ పొందుతున్నారు. హార్దిక్ పాండ్యా సైతం ఫిట్నెస్ సాధించేందుకు శ్రమిస్తున్నాడు. ఇక ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్, ఆ తదుపరి సంవత్సరం వన్డే ప్రపంచకప్ జరుగనుంది. ఇలా వరుస ఐసీసీ ఈవెంట్ల నేపథ్యంలో ఆటగాళ్లు గాయాలపాలవడం టీమిండియాలో ఆందోళనకు కారణమైంది. ఈ విషయంపై దృష్టి సారించిన హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్.. నితిన్ పటేల్‌ను ఎన్సీఏకు పంపాలన్న ఆలోచనను బీసీసీఐతో చర్చించినట్లు క్రిక్‌బజ్ తన కథనంలో పేర్కొంది. అనువజ్ఞుడైన నితిన్ ఎన్సీఏలో ఉంటే జట్టుకు మేలు చేకూరుతుందన్న వాదనతో ఏకీభవించిన బోర్డు.. ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. శ్రీలంకతో బెంగళూరు వేదికగా జరుగనున్న రెండో టెస్టు తర్వాత ఇందుకు సంబంధించి ప్రకటన వెలువరించే అవకాశం ఉందని పేర్కొంది. అంతేగాక ఇటీవల ఫిజియోథెరపిస్ట్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానించిన బోర్డు.. సీనియర్ వుమెన్ టీమ్ కోసం సీనియర్ ఫిజియోథెరపిస్ట్ కోసం అన్వేషణలో పడినట్లు పేర్కొంది. చదవండి: IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. మరో స్టార్ ఆటగాడు దూరం! -
టీమిండియాకు పాట్రిక్ బైబై
మాంచెస్టర్: వరల్డ్‌కప్‌లో సెమీస్‌లోనే భారత్ ప్రస్థానం ముగియడంతో జట్టుతో ఫిజియో పాట్రిక్ పయనం సైతం ఆగిపోయింది. 2015లో భారత జట్టు ఫిజియోగా పాట్రిక్ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఒప్పందం ప్రకారం 2019 వరల్డ్‌కప్ వరకు మాత్రమే ఆయన కొనసాగాలి. ఈ క్రమంలో ప్రస్తుత వరల్డ్‌కప్‌తోనే ఆయన పదవీకాలం పూర్తయ్యింది. దీంతో ఫిజియోగా తాను తప్పుకొంటున్నట్లు పాట్రిక్ గురువారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ‘గత నాలుగేళ్లుగా భారత జట్టుతో నా ప్రయాణం అద్భుతంగా సాగింది. ఈ అవకాశం కల్పించిన బీసీసీఐకి కృతజ్ఞతలు. టీమిండియా భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలి’అని అందులో ఆయన పేర్కొన్నాడు. -
కోహ్లికి ప్రమాదం లేదు
భారత జట్టుకు కెప్టెన్‌గా కోహ్లి ఇచ్చే ఉత్తేజం ఏమిటో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఆటగాడు 90 ఓవర్ల ఆటలో 51 ఓవర్లు మైదానంలో లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? తొలి రోజు ఆటలో బౌలింగ్ వైఫల్యంతో పాటు కోహ్లి గాయపడటం భారత్‌కు షాక్ ఇచ్చింది. జడేజా వేసిన ఇన్నింగ్స్ 40వ ఓవర్ తొలి బంతిని హ్యాండ్స్కోంబ్ మిడాన్ వైపు ఆడాడు. ఆ బంతిని వెంటాడిన కోహ్లి బౌండరీని ఆపే క్రమంలో పట్టు తప్పాడు. వేగవంతమైన అవుట్‌ఫీల్డ్‌పై తనను తాను నియంత్రించుకోలేక కింద పడిపోయాడు. దాంతో అతని భుజానికి బలంగా దెబ్బ తగిలింది. ఫిజియో సహాయంతో బయటకు వెళ్లిన అతను మళ్లీ బరిలోకి దిగలేదు. ఆట సాగినంతసేపూ ఐస్ ప్యాక్స్‌తో అతను సేదతీరాడు. గురువారం సాయంత్రం కోహ్లి భుజానికి స్కానింగ్ నిర్వహించారు. ఫలితాలు వచ్చిన అనంతరం అతని గాయం తీవ్రమైనదేమీ కాదని, మెల్లగా కోలుకుంటున్నాడని బీసీసీఐ ప్రకటించింది. అతని భుజానికి చికిత్స నిర్వహిస్తున్నట్లు బోర్డు వైద్య బృందం స్పష్టం చేసింది. రాంచీ టెస్టులో బరిలోకి దిగే విధంగా చికిత్సను కొనసాగిస్తామని వెల్లడించింది. కోహ్లికి అయిన గాయం బయటకు కనిపిస్తున్నదే కాబట్టి నిబంధనల ప్రకారం అతను తన రెగ్యులర్ స్థానంలో బ్యాటింగ్‌కు దిగేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. -
అడిగితే వద్దన్నారు... ఇప్పుడు పంపించారు!
దీపా కర్మాకర్ కోసం ఫిజియో రియో: ఒలింపిక్స్‌లో జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఫైనల్స్‌కు క్వాలిఫై అయిన తర్వాత గానీ ఆమె విలువను భారత అధికారులు గుర్తించలేదు. ఈ పోటీలకు ముందు తనకు ఫిజియో కావాలని, కఠినమైన ఈవెంట్ల సాధన తర్వాత కోలుకునేందుకు ఎంతో అవసరం అవుతుందని దీపా మొత్తుకుంది. అయితే అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం హడావిడిగా దీపా కోసం ఫిజియో సజ్జాద్ మీర్‌ను పంపించింది. మంగళవారం సాయంత్రమే మీర్ రియోకు చేరుకున్నారు. -
భారత జట్టు ఫిజియోగా ఫర్హర్ట్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కొత్త ఫిజియోగా ఆస్ట్రేలియాకు చెందిన ప్యాట్రిక్ ఫర్హర్ట్ ఎంపికయ్యారు. ఇటీవల వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసిన నితిన్ పటేల్ స్థానంలో ఫర్హర్ట్ను బీసీసీఐ నియమించింది. వచ్చే నెలలో జరిగే భారత్, శ్రీలంక టెస్టు సిరీస్‌నుంచి అతను బాధ్యతలు చేపడతాడు. ఫిజియోగా దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ప్యాట్రిక్ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు పని చేశాడు. టీమ్ మసాయర్గా అరుణ్ కనడేను ఎంపిక చేయగా, ఇటీవల జింబాబ్వే సిరీస్ నుంచే స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ నిపుణుడిగా శంకర్ బసు కూడా జట్టుతో చేరాడు. ఈ ముగ్గురికి బోర్డు ఏడాది కాంట్రాక్ట్ ఇచ్చింది. -
సైకో వీరంగం, ఎస్ఐ, కానిస్టేబుళ్లకు గాయాలు
హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఏకంగా పోలీసులపైనే దాడి చేశాడు. చాదర్ఘట్ పోలీస్‌స్టేషన్ పరిధి శంకర్‌నగర్‌కు చెందిన సైకో ఇసామియా.. ఓ ఫంక్షన్‌కు వెళ్లి అక్కడ శివ, బాబులపై కత్తితో దాడి చేశాడు. దీనిపై ఫిర్యాదు అదుకున్న చాదర్ఘట్ ఎస్సై మహేష్...కానిస్టేబుల్స్‌ను వెంటబెట్టుకొని ఘటనాస్థలానికి వెళ్లారు. అయితే ఇసామియా అనూహ్య రీతిలో ఎస్ఐతో పాటు, కానిస్టేబుళ్లపైన కత్తితో దాడి చేశాడు. గాయాలైన ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎట్టకేలకు సైకో ఇసామియాను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
హైదరాబాద్‌లో సైకో వీరంగం