ఎంజీబీఎస్‌లో కిడ్నాప్ గ్యాంగ్ అరెస్టు
Published Tue, Jul 26 2016 3:40 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
హైదరాబాద్: నగరంలోని మహాత్మగాంధీ బస్ స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులను కిడ్నాప్ చేసి, హతమారుస్తున్న నలుగురు సభ్యుల ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పదిహేను రోజుల క్రితం బస్టాండ్‌లో ఉన్న ఓ యువకుడిని కిడ్నాప్ చేసి.. అనంతరం దారుణంగా చంపారు. దీనిపై ఉప్పందుకున్న పోలీసులు వారి కదలికలపై నిఘా పెట్టారు. ఆ ముఠా సభ్యులు.. మరో ఇద్దరిని కిడ్నాప్ చేసేందుకు పథకం వేశారు. దీనిని పసిగట్టిన పోలీసులు మంగళవారం మధ్యాహ్నం వారిని అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్ సభ్యులు జార్ఖండ్, మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. డబ్బు కోసమే వారు ఈ దుశ్చర్యలకు ఒడిగడుతున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement