kidnap gang
-
పక్కా సమాచారంతో స్ట్రింగ్ ఆపరేషన్.. ఆ ముఠా గుట్టురట్టు!
సాక్షి,ఖమ్మం గాంధీచౌక్: ఖమ్మం కేంద్రంగా శిశు విక్రయాలు సాగిస్తున్న ముఠా కార్యకలాపాలను మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం(ఏహెచ్‌టీఓ), చైల్డ్‌లైన్ బృందం బట్టబయలు చేసింది. నవజాత శిశువులతో పాటు అప్పుడే పుట్టిన పసికందులను విక్రయిస్తున్నారనే సమాచారం అందడంతో రంగంలోకి దిగిన బృందం తమకు పిల్లలు కావాలని ముఠా సభ్యులతో సంప్రదింపులు జరిపారు. ఆతర్వాత డబ్బు చెల్లిస్తామని నమ్మబలుకుతూ ముఠా గుట్టు రట్టు చేయడం విశేషం. ఈమేరకు ముఠా సభ్యులపై ఖమ్మం టూ టౌన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేయగా వివరాలిలా ఉన్నాయి. పిల్లలు లేని దంపతులే టార్గెట్ వివాహమై ఏళ్లు గడిచినా సంతానం కలగని దంపతులు అధికారికంగా దత్తత ప్రక్రియపై అవగాహన లేక ఇతరులను ఆశ్రయిస్తున్నారు. ఇదేఅదునుగా రంగంలోకి దిగిన ముఠా, పిల్లలను పోషించలేని వారి నుంచి తీసుకుని రూ.లక్షల్లో నగదు తీసుకుని అమ్ముకుంటున్నారు. ఈక్రమంలో జిల్లాకేంద్రంలోని వికలాంగుల కాలనీకి చెందిన ఉప్పతల పుల్లారావు, అద్దంకివారి వీధికి చెదిన మోదుగు మేరీ నవజాత శిశువులు, చిన్న పిల్లలను అమ్ముతున్నారని గుర్తు తెలియని వ్యక్తులు చైల్డ్‌లైన్ – 1098 కోఆర్డినేటర్ కువ్వారపు శ్రీనివాస్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన చైల్డ్‌లైన్ ఉన్నతాధికారులతో పాటు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సీఐ నవీన్, సీడీపీఓ కవితకు తెలిపారు. ఈమేరకు మూడు శాఖలకు చెందిన ఉద్యోగులు అనూష, నరసింహారావు, భాస్కర్‌ను బృందంగా ఏర్పాటుచేసి స్ట్రింగ్ ఆపరేషన్ చేయించారు. వీరు ముగ్గురు మేరీతో పరిచయం పెంచుకుని తమకు పాప కావాలని కోరారు. ఎంత నగదైనా చెల్లిస్తామని చెప్పడంతో ఆమె పలువురు పసిపిల్లల ఫొటోలను వాట్సాప్‌లో పంపించి ధర కూడా వెల్లడించింది. ఇటీవల ఓ పాపను విక్రయించినట్లు చెబుతూ బాండ్ పేపర్లపై రాసిస్తామని, భవిష్యత్‌తో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పగా అన్ని వివరాలు రికార్డు చేశారు. ఇంతలోనే ఖమ్మం జెడ్పీ సెంటర్లోని ఓ ఆస్పత్రిలో కొణిజర్ల మండలానికి చెందిన మహిళ మూడో కాన్పులో ఆడ శిశువుకు జన్మనిచ్చిందని, ఆమె డిశ్చార్జి కాగానే పాపను అమ్మాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఇందుకోసం రూ.4లక్షలు చెల్లించాలని, అడ్వాన్స్‌గా రూ.1.50లక్షలు ఇవ్వాలని సూచిస్తూ నగదుతో జెడ్పీ సెంటర్‌కు రావాలని చెప్పింది. ఇందుకు ఒప్పుకున్న అనూష బృందం నగదు, బాండ్ పేపర్లతో సోమవారం సాయంత్రం జెడ్పీసెంటర్‌కు వెళ్లగా ఖమ్మం టూ టౌన్ పోలీసులు రంగంలోకి దిగి పుల్లారావు, మోదుగు మేరీతో పాటు వీరికి సహకరించిన తలారి రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. కాగా, శిశువును విక్రయించేందుకు ముందుకొచ్చిన ఆమె తల్లి, ఓ ఆస్పత్రి ఉద్యోగి పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈసందర్భంగా శిశు విక్రయాల వ్యవహారాన్ని చాకచక్యంగా చేధించిన చైల్డ్‌లైన్, మానవ అక్రమ రవాణా నిరోధక బృందం ప్రతినిధులను చైల్డ్‌లైన్ డైరెక్టర్ ఎంఎల్.ప్రసాద్, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ భారతీరాణి తదితరులు అభినందించారు. చదవండి: రాజాసింగ్‌కు షాక్.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు ∙ -
వెలుగులోకి ‘వెబ్ సిరీస్ సూరి’ మరో వ్యవహారం.. శ్వేత ద్వారా ఎర వేసి!
సాక్షి, హైదరాబాద్: ‘వెబ్ సిరీస్’ కిడ్నాపర్ గంజపోగు సురేష్ అలియాస్ సూరి వ్యవహారాలకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతగాడు తన గ్యాంగ్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గండికోట రవి అనే యువకుడిని రెండుసార్లు కిడ్నాప్ చేశాడని బయటపడింది. ఏడాది వ్యవధిలో జరిగిన ఈ అపహరణల్లో అతడి కుటుంబం నుంచి నగదు వసూలు చేశాడు. ఇక్కడి అధికారుల విచారణ ముగిసిన తర్వాత సూరిని పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లడానికి తెనాలి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. బీచ్‌కు పోదామంటూ తొలిసారి... తెనాలి మండలం అంగలకోడూరు గ్రామానికి చెందిన గండికోట రవి వివాహితుడు. అయితే అనివార్య కారణాల నేపథ్యంలో మూడేళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఇతడికి ఏడాది క్రితం ఫేస్బుక్ ద్వారా సూర్య పేరుతో సూరి పరిచయమయ్యాడు. ఇద్దరూ స్నేహితులుగా మారడంతో పాటు ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకుని కొన్నాళ్లు చాటింగ్స్ చేసుకున్నారు. సూరి ఓ రోజు తాను బాపట్ల బీచ్ చూడాలని అనుకుంటున్నానంటూ రవితో చెప్పాడు. దీంతో అంగలకోడూరు వరకు రావాలని, ఇద్దరం కలిసి వెళ్లి బీచ్ చూద్దామంటూ అతడు కోరాడు. పథకం ప్రకారం తన అనుచరులతో కారులో అంగలకోడూరు వరకు వెళ్లిన సూరి అందులోనే రవిని కిడ్నాప్ చేసి సిటీకి తీసుకువచ్చాడు. చదవండి: హైదరాబాద్: మార్చి నాటికి మరో నాలుగు ప్రాజెక్టులు శ్వేత ద్వారా ఎర వేసి... రవిని ఓ గదిలో బంధించి ఉంచిన సూరి తీవ్ర స్థాయిలో బెదిరించాడు. ఆపై అతడి తల్లికి ఫోన్ చేసి డబ్బు చెల్లించాలని లేదంటే రవిని చంపేస్తామంటూ హెచ్చరించాడు. ఇలా ఆమె నుంచి ఫోన్ పే ద్వారా రూ.50 వేలు వసూలు చేసి రవిని విడిచిపెట్టాడు. అప్పటికే తీవ్రభయాందోళనల్లో ఉన్న రవి ఈ విషయాన్ని పోలీసులకూ ఫిర్యాదు చేయలేదు. ఇటీవల మరోసారి అతడిని టార్గెట్ చేసిన సూరి తన ‘ఉద్యోగిని’ శ్వేత చారిని రంగంలోకి దింపాడు. ఫేస్బుక్ ద్వారా రక్షిత పేరుతో రవికి పరిచయమైన ఈమె అతడి ఫోన్ నెంబర్ తీసుకుంది. కొన్నాళ్లు మాట్లాడిన తర్వాత గత నెల 5న అసలు కథ మొదలెట్టింది. తాను సూర్యాపేటలో ఉంటానని, వస్తే కలుద్దామంటూ ఎర వేసింది. దీంతో 16న రవి ద్విచక్ర వాహనంపై సూర్యాపేట వచ్చాడు. గదిలో బంధించి డబ్బు వసూలు... అప్పటికే అక్కడ కాసుకుని ఉన్న సూర్య అండ్ గ్యాంగ్ తమ కారులో రవిని కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకువచ్చింది. మరోసారి అతడి తల్లికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగడంతో పాటు రూ.5 లక్షలు డిమాండ్ చేసింది. బేరసారాల తర్వాత ఫోన్ పే ద్వారా రూ.55 వేలు వసూలు చేసి అతడిని వదిలిపెట్టింది. తన స్వస్థలానికి తిరిగి వెళ్లిన రవి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడాడు. రెండుసార్లు తమ వల్లోపడిన రవి నుంచి మరికొంత మొత్తం వసూలు చేయాలని భావించిన సూరి మళ్లీ ఫోన్లు చేయడం మొదలెట్టాడు. తనకు డబ్బు కావాలంటూ బెదిరిస్తుండటంతో ఈ నెల 13న ర వి తెనాలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
పాతబస్తీలో కిడ్నాప్ ముఠా గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో చిన్నారులను కిడ్నాప్ చేసి మార్కెట్లో అమ్ముతున్న ముఠా గట్టును పోలీసులు రట్టు చేశారు. నలుగురు సభ్యులు గల ముఠాను అదుపులోకి తీసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు ముగ్గురు చిన్నారులను రక్షించారు. పిల్లల్ని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. వారం రోజుల కిందట చీరల వ్యాపారి ఫజల్ తన కొడుకు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టింది. ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురు మహిళలను పోలీసులు అదులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ముగ్గురు చిన్నారులకు విముక్తి కల్పించారు. ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న చిన్నారులను కిడ్నాప్ చేసి.. పిల్లలు లేని వారికి విక్రయిస్తున్నారు. ఇందుకోసం రూ. 10వేల నుంచి రూ.30 వేల వరకు తీసుకుంటున్నారు. అయితే నిందుతులు ఇంకా ఎవరైనా చిన్నారులను కిడ్నాప్ చేసిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. -
స్కూళ్ల వద్ద బిహార్ ముఠా.. కలకలం..!
సాక్షి, వికారాబాద్ : చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే బిహార్ ముఠాలు తిరుగుతున్నాయనే వార్తల నేపథ్యంలో వికరాబాద్‌లో కలకలం రేగింది. బిహార్‌కు చెందిన యువకుడు పాఠశాలల వద్ద తచ్చాడుతూ పట్టుబడడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. అతడు చిన్నపిల్లల కిడ్నాప్‌నకు యత్నిస్తున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. బిహార్‌కు చెందిన యువకుడు శనివారం ఓ పాఠశాల ముందు నిలబడి చిన్నారిని పిలిచి చాక్లెట్ ఇస్తానని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో భయపడిన ఆ చిన్నారి జరిగిన విషయం స్కూల్ టీచర్‌కు చెప్పింది. ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు సదరు యువకున్ని వెంబడించి పట్టుకొన్నారు. పిల్లల్ని కిడ్నాప్ చేసేందుకు యత్నించాడని ఆరోపిస్తూ అతనిపై దాడికి దిగారు. అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. గత నాలుగు రోజుల నుంచి బిహార్ యువకుడు వికారాబాద్ పట్టణంలో తిరుగుతున్నాడని వెల్లడించారు. ఇతర ప్రాంతాల్లోను బీహార్ ముఠాలు ఉండొచ్చని, చిన్నారుల రక్షణ విషయంలో తల్లిదండ్రులు, స్కూళ్ల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. -
టటుల్ బాజీ గ్యాంగ్ ఆటకట్టు
సాక్షి, సిటీబ్యూరో: దేశ వ్యాప్తంగా దృష్టి మళ్లించడం, నకిలీ బంగారం అంటగట్టడంతో పాటు ఎరవేసి కిడ్నాప్‌లు, బెదిరింపు వసూళ్లకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన టటుల్ బాజీ గ్యాంగ్‌ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అత్యంత కీలకమైన ఆపరేషన్ చేపట్టి ఇద్దరిని పట్టుకున్నట్లు డీసీపీ అవినాష్ మహంతి మంగళవారం వెల్లడించారు. వీరి నుంచి 500 గ్రాముల నకిలీ బంగారం, శాంపిల్‌గా చూపించే చిన్న బంగారం ముక్క స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మేవాట్ రీజియన్‌లో 25 గ్యాంగులు... రాజస్థాన్‌లోని అల్వార్, ఉత్తరప్రదేశ్‌లోని మధుర, హర్యానాలోని నుహ్ సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని మేవాట్ రీజియన్‌గా పరిగణిస్తారు. ఇందులోని 35 గ్రామాల్లో 100 మందికి పైగా నేరచరితులే. వీరి నేతృత్వంలో 25 ముఠాలు పని చేస్తున్నారు. నకిలీ బంగారం ఇటుకలను చూపించి అసలువిగా నమ్మించి మోసం చేయడం వీరి ప్రధాన నైజం. ఈ ఇటుకలను ‘టటుల్’ గా పిలుస్తారు. మోసాలకు పాల్పడే దందాను ‘బాజీ’ అంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ముఠాకు టటుల్ బాజీ గ్యాంగ్ అనే పేరు వచ్చింది. 2010 నుంచి నేరాలు చేస్తున్న ఈ అంతర్రాష్ట్ర ముఠా తొలినాళ్లల్లో నకిలీ బంగారం దందా చేసేది. తాజాగా వ్యాపారులకు ఎరవేసి, తమ ప్రాంతాలకు రప్పించడం ద్వారా కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేయడం మొదలెట్టింది. నోట్లో ముక్కను చూపించి మోసాలు... ఈ ముఠా తొలినాళ్లల్లో చేసిన ‘బంగారం ఫ్రాడ్’లోనే తమదైన పంథా అనుసరించింది. తమ వద్ద మధ్య ఆసియా ప్రాంతం నుంచి తీసుకువచ్చిన, తవ్వకాల్లో దొరికిన బంగారం ఇటుక ఉందని వ్యాపారులకు ఎర వేస్తారు. తక్కువ ధరకు విక్రయిస్తామంటూ తమ ప్రాంతాలకు రప్పిస్తుంది. అప్పటికే ఈ ముఠా సభ్యుడు చిన్న బంగారం ముక్కను తన నోట్లో సిద్ధంగా ఉంచుకుంటాడు. వ్యాపారి వచ్చిన తర్వాత తన చేతిలో ఉన్న చిన్న బంగారపు ఇటుకలా ఉన్న దాంట్లోంచి ఓ ముక్కను తీస్తాడు. వ్యాపారి దృష్టి మళ్లించడం ద్వారా దీనికి బదులు నోట్లు ఉన్న అసలు బంగారం ముక్కను అతడికి ఇస్తాడు. సదరు ముక్కను పరీక్షించే వ్యాపారి అది మేలిమి బంగారంగా తేలడంతో నగదు ఇచ్చి ఇటుక తీసుకుంటాడు. తిరిగి వచ్చిన తర్వాత మాత్రమే తాను మోసపోయాననే విషయం గుర్తిస్తాడు. కొందరిని అక్కడే బంధించి.. ఫొటోలు కుటుంబీకులకు పంపి... ఇలా బందీ అయిన బాధితుడిని ఓ ప్రాంతంలో బంధించడంతో పాటు తుపాకీ గురి పెట్టిన ఫొటోలు తీస్తారు. వీటిని బాధితుడి సెల్‌ఫోన్ నుంచే అతడి కుటుంబీకులకు వాట్సాప్ ద్వారా పంపుతారు. తక్షణం తాము కోరిన మొత్తం బ్యాంకు ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయకపోతే తమ వద్ద ఉన్న మీ వాడిని చంపేస్తామంటూ బెదిరిస్తారు. బాధితుడి తరఫు వారు డిపాజిట్ చేసిన వెంటనే డ్రా చేసుకుని బందీని విడిచిపెడతారు. నగరానికి చెందిన ఓ ప్రముఖుడికి ఇటీవల ఫోన్ చేసింది. దీనిపై అలీ మహ్మద్ సర్ఫరాజ్ ఫిర్యాదు చేయడంతో సీసీఎస్‌లో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ జి.గిరీష్‌రావు నేతృత్వంలో ఎస్సై బి.శ్రవణ్‌కుమార్‌తో కూడిన బృందం రాజస్థాన్‌కు వెళ్లి అతికష్టమ్మీద ఆ ముఠాకు చెందిన కుర్షీద్ అహ్మద్, సలీంలను అరెస్టు చేసి తీసుకువచ్చింది. -
సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తే ఊరుకోం
-
సీసీటీవిలో రికార్డయిన హిజ్రాలపై దాడి దృశ్యాలు
-
పాతబస్తీలో ఉద్రిక్తత : హిజ్రాలపై రాళ్లతో దాడి
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియా పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా సంచరిస్తున్నట్లు వస్తున్న వదంతులకు అమాయకుల ప్రాణాలు బలైతూనే ఉన్నాయి. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని పాతబస్తీలో ఉద్రిక్తత వాతారణం నెలకొంది. పిల్లలను ఎత్తుకెళ్తున్నారనే నెపంతో స్థానికులు ముగ్గురు హిజ్రాలపై స్థానికులు రాళ్లతో దాడి చేశారు. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని స్థానికులను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపై కూడా దాడులకు దిగారు. పెట్రోలింగ్ వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సివచ్చింది. అయిదే దాడిలో తీవ్రంగా గాయపడిన ఒకరు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే తీరులో మాదన్నపేటలో సైతం ముగ్గురు బిహార్ వాసులను స్థానికులు చితకబాదారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్సా అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చంద్రాయణగుట్ట ఘటనా స్థలాన్ని సౌత్‌జోన్ డీజీపీ సత్యనారాయణ పరిశీలించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని, ప్రజలు భయాందోళనకు గురికావోద్దని తెలిపారు. ప్రస్తుతం పాతబస్తీలో ప్రశాంతత నెలకొందని తెలిపారు. మృతిచెందిన హిజ్రాను శంషాబాద్‌కు చెందినది గుర్తించారు. 25 మంది అనుమానితులని అదుపులోకి తీసుకున్నట్లు డీజీపీ తెలిపారు. పోలీసులు ఎంత చెబుతున్నా.. ప్రజల్లో అవగాహాన రావడం లేదు. -
చంద్రయాన్‌గుట్టలో హిజ్రాలపై రాళ్ల దాడి;ఒకరు మృతి
-
అ వదంతులు నమ్మొద్దు : డీజీపీ
సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కిడ్నాప్ గ్యాంగులు, దోపిడీ గ్యాంగుల ప్రచారంపై గురువారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్య స్పందించారు. అలాంటి గ్యాంగులు రాష్ట్రంలోకి రాలేదని, ఆ వదంతులు ప్రజలు నమ్మొద్దని తెలిపారు. అలాంటి వాటిని నమ్మి అమాయకులపై దాడి చేయడం మంచిది కాదన్నారు. మతి స్థిమితం లేని వారిపై దాడులకు పాల్పడటం విచారకమన్నారు. ఆ వందతులను నమ్మి ప్రజలు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం నేరమన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టంచేశారు. అలాగే.. తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి దీనిపై స్పందించారు. అలాంటి గ్యాం గులు రాష్ట్రంలోకి రాలేదని, ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగలేదని స్పష్టంచేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భద్రత కోసం పోలీస్ శాఖ ప్రతీక్షణం పనిచేస్తోందని వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడైనా 100కు కాల్ చేయాలని, దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫేస్బుక్, ట్విటర్ తదితర సోషల్ మీడియా ద్వారా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన ట్విటర్ ద్వారా తెలిపారు. -
దొంగల ముఠాలపై పుకార్లను నమ్మొద్దు
-
దొంగల ముఠాల సంచారం వదంతే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎలాంటి అంతర్రాష్ట్ర కిడ్నాపింగ్, దోపిడీ దొంగల ముఠాల సంచారం లేదని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. వీటికి సంబంధించి సోషల్ మీడి యాలో జరుగుతున్న ప్రచారం వదంతి మాత్రమే అన్నారు. ఇలాంటి పుకార్లను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడమే కాదు.. షేర్/ఫార్వర్డ్ చేయడమూ నేరమేనని హెచ్చరించా రు. బుధవారం డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీలు జితేందర్, గోవింద్‌సింగ్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ... ‘సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి వార్తలు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయడంతోపాటు ప్రతి ఒక్కరినీ అనుమానించే స్థితికి తీసుకెళ్తున్నాయి. అనుమానితులు సరైన సమాధానం చెప్పకపోతే ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఇలా జరిగిన దాడుల్లో భీమ్‌గల్, బీబీనగర్ ఠాణాల పరిధిలో ఇద్దరు చనిపోవడం బాధాకరం. గ్రామాలతో సహా ప్రతి చోటా నిఘా, సీసీ కెమెరా వ్యవస్థ, కమ్యూనిటీ పోలీసింగ్ విధానాలు పటిష్టం చేసుకున్నాం. ప్రజల సహకారంతో ఎక్కడ నేరం జరిగినా, నేరగాళ్లు సంచరిస్తున్నా తక్షణం పట్టుకుంటాం. సోషల్‌మీడియా వార్తలతో గ్రామాల్లో యువత చేతుల్లో కర్రలు పట్టుకుని గస్తీ కాయడం సరైంది కాదు. ఏదైనా అనుమానం వస్తే ‘100’కు సమాచారమివ్వండి. అర్బన్ ప్రాంతాల్లో గరిష్టంగా 10 నిమిషాలు, రూరల్ ఏరియాల్లో 30 నిమిషాల్లో పోలీసులు వస్తారు. భీమ్‌గల్, బీబీనగర్ ఘటనలపై కేసులు నమోదు చేశాం. కొందరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాం. సోషల్ మీడియా తిప్పికొట్టడానికి హైదరాబాద్‌తో పాటు కమిషనరేట్లలో ప్రతి పోలీసు స్టేషన్‌కు ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలున్నాయి. జిల్లా స్థాయిల్లోనూ అన్ని ఠాణాలకు వీటిని క్రియేట్ చేసేందుకు, పక్కాగా నిర్వహించేందుకు జిల్లాకో సోషల్‌మీడియా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశాం. భీమ్‌గల్, బీబీనగర్ తరహా ఉదంతాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలిచ్చాం. ప్రజలు హాయిగా నిద్రపోవచ్చు. వారి కోసం మేం కాపలా కాస్తాం’అని మహేందర్‌రెడ్డి వివరించారు. -
వదంతులు నమ్మొద్దు కిడ్నాప్ గ్యాంగ్‌లపై డీజీపీ
సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కిడ్నాప్ గ్యాంగులు, దోపిడీ గ్యాంగుల ప్రచారంపై డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. అలాంటి గ్యాం గులు రాష్ట్రంలోకి రాలేదని, ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగలేదని మంగళవారం స్పష్టంచేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భద్రత కోసం పోలీస్ శాఖ ప్రతీక్షణం పనిచేస్తోందని వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడైనా 100కు కాల్ చేయాలని, దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా ద్వారా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. -
సోషల్ మీడియాలో వదంతులు నమ్మకండి..
-
‘వదంతులు నమ్మకండి.. ఫోన్ చేయండి’
సాక్షి, విశాఖపట్నం/విజయవాడ/ఏలూరు : కిడ్నాప్, సైకో ముఠాల వదంతులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న రూమర్లతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ‘సైకోలు వచ్చారు... పిల్లలను ఎత్తుకుపోతున్నారు.. రాత్రివేళ ఎవరైనా తలుపు కొడితే తీయకండి.. చంపేసి డబ్బు, నగలు దోచుకుపోతారు..’ వంటి హెచ్చరికలతో కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ వదంతులని, వీటిలో ఏమాత్రం వాస్తవం లేదని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. వదంతులు నమ్మకుండా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి వార్తలు నమ్మొద్దని విశాఖపట్నం పోలీసు కమిషనర్ టి. యోగానంద్ కోరారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చిన్నపిల్లలను నరికి చంపుతున్నారనే వాట్సప్ మెసేజ్‌లు వచ్చిన నేపథ్యంలో కృష్ణాజిల్లా గన్నవరం మండలం చనుపల్లివారిగూడెం గ్రామంలో పోలీసులు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వదంతులు నమ్మవద్దని విజయవాడ డీసీపీ గజరావు భూపాల్ ఈ సందర్భంగా ప్రజలను కోరారు. సోషల్ మీడియాలో ఇలాంటి వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా జిల్లాలో చిన్నపిల్లలను కిడ్నాప్ చేసే గ్యాంగ్‌లు తిరుగుతున్నాయంటూ సోషల్ మీడియాల్లో వస్తున్న వార్తలు, ఫోటోల్లో నిజం లేదని పశ్చిమగోదావరి జిల్లా డీఎస్పీ ఈశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇలాంటి వదంతుల వల్ల ఇప్పటికే ఏలూరు డివిజన్ పరిధిలో ఐదు చోట్ల అమాయకులపై దాడి జరిగాయని, ఏలూరు డివిజన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వదంతులు వ్యాపించి ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఎవరి మీదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. -
భద్రాది జిల్లాలో కిడ్నాపర్ ముఠా అరెస్ట్
-
పరారీలో 3 వేల కుటుంబాలు
టీ.నగర్: పిల్లల కిడ్నాపర్ అని వృద్ధురాలి హత్య కేసుకు భయపడి పోలూరు, పరిసర ప్రాంతాల్లో మూడు వేల కుటుంబాలు ఇళ్లను విడిచి పరారయ్యాయి. వీరంతా చెన్నై బెంగళూరు ప్రాంతాల్లో బసచేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పిల్లల కిడ్నాప్ ముఠాలు సంచరిస్తున్నాయంటూ వాట్సాప్‌లో వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే. ఉత్తర జిల్లాల నుంచి వచ్చిన ఈ సమాచారం ప్రజల్లో భీతి పుట్టించింది. ఈ క్రమంలో తిరువణ్ణామలై జిల్లా పోలూరు సమీపం కిడ్నాప్ ముఠా భీతి కారణంగా రుక్మిణి అమ్మాళ్ అనే 65 ఏళ్ల వృద్ధురాలి హత్యా సంఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ విషయం తెలియగానే తిరువణ్ణామలై ఎస్పీ సంఘటన స్థలానికి నేరుగా వచ్చి విచారణ జరిపారు. రుక్ష్మిణి అమ్మాళ్‌పై దాడి దృశ్యాలు సామాజిక మా«ధ్యమాల్లో ప్రసారం కావడంతో సంచలనం ఏర్పడింది. ఈ వ్యవహారానికి సంబంధించి 42 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద తీవ్ర విచారణ జరుపుతున్నారు. పిల్లల కిడ్నాప్ భీతి కారణంగా కలియం, ఆత్తిమూరు గ్రామాల్లో ఉదయాన్నే కనిపించే కొబ్బరిబొండాల వ్యాపారులు కనిపించడం లేదు. ఈ ప్రాంతాల్లో పోలీసులు రహస్య పర్యవేక్షణ జరుపుతున్నారు. మానసిక రోగి హత్య కేసులో 15 మంది అరెస్టు: కిడ్నాపర్‌గా భావించి మానసిక రోగిని హత్య చేసిన కేసులో పోలీసులు 15 మందిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. పళవేర్కాడు ప్రాంతంలో పిల్లల కిడ్నాప్ ముఠాకు చెందిన వ్యక్తిగా భావించి ఒక మానసిక రోగిని ప్రజలు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో 15 మందిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. -
చిన్న పిల్లల కిడ్నాప్ ముఠా అరెస్ట్
అనంతపురం సెంట్రల్: చిన్న పిల్లల కిడ్నాప్‌కు పాల్పడే ముఠాను త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను సీఐ మురళీకృష్ణ ఒక ప్రకటనలో వెల్లడించారు. నగరంలోని ఇందిరానగర్‌లో జగన్నాథ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఇతనికి ప్రగతి, పూజిత అనే కుమార్తెలు ఉన్నారు. గత నెల 18న ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారులతో కొంతమంది మాటలు కలిపారు. చాక్లెట్లు ఇస్తుండగా గమనించిన తల్లిదండ్రులు వారిని వారించారు. నిందితులు, తల్లిదండ్రుల మధ్య గొడవ జరిగింది. అనంతరం అనుమానం వచ్చిన జగన్నాథ్ జరిగిన విషయాన్ని త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తాజాగా బుధవారం వారు మరోసారి ఇంటి వద్ద రెక్కి నిర్వహించారు. నిందితులను పసిగట్టిన జగన్నాథ్ పోలీసులకు తెలిపాడు. గురువారం రైల్వేస్టేషన్ సమీపంలోని శివాలయం దగ్గర ముఠా ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో డోన్‌కు చెందిన ఎరికల రవి, నల్లచెరువు మండలానికి చెందిన వడ్డె రామాంజనేయులు, డోన్‌కు చెందిన అర్జున్ ఉన్నారు. వీరితో పాటు భారతి, సరోజ అనే మహిళలు కూడా ముఠాలో ఉన్నట్లు గుర్తించారు. మహిళా నేరస్తుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వివరించారు. -
కిడ్నాప్ గ్యాంగ్ అరెస్ట్
కరీంనగర్: నగరంలో కిడ్నాప్‌లకు పాల్పడుతోన్న ఆరుగురు సభ్యుల ముఠాను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నుంచి ఒక కంట్రీ మేడ్ 8 ఎంఎం తపంచా, నాలుగు రౌండ్ల తూటాలు, రూ. 20 వేల నగదు, ఓ కారు స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్ ముఠాలో ఓ మాజీ నక్సలైట్ కూడా ఉన్నాడు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. -
ఎంజీబీఎస్‌లో కిడ్నాప్ గ్యాంగ్ అరెస్టు
హైదరాబాద్: నగరంలోని మహాత్మగాంధీ బస్ స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులను కిడ్నాప్ చేసి, హతమారుస్తున్న నలుగురు సభ్యుల ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పదిహేను రోజుల క్రితం బస్టాండ్‌లో ఉన్న ఓ యువకుడిని కిడ్నాప్ చేసి.. అనంతరం దారుణంగా చంపారు. దీనిపై ఉప్పందుకున్న పోలీసులు వారి కదలికలపై నిఘా పెట్టారు. ఆ ముఠా సభ్యులు.. మరో ఇద్దరిని కిడ్నాప్ చేసేందుకు పథకం వేశారు. దీనిని పసిగట్టిన పోలీసులు మంగళవారం మధ్యాహ్నం వారిని అదుపులోకి తీసుకున్నారు. గ్యాంగ్ సభ్యులు జార్ఖండ్, మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. డబ్బు కోసమే వారు ఈ దుశ్చర్యలకు ఒడిగడుతున్నట్లు సమాచారం. -
కిడ్నాప్ గ్యాంగ్ అరెస్ట్
హైదరాబాద్:వ్యాపారులను కిడ్నాప్ చేసి హత్యలకు కుట్ర పన్నుతున్న ముఠాగుట్టు రట్టు చేశారు నగర పోలీసులు. మంగళవారం మాజీ మావోయిస్టు సహా మరో నలుగురు కిడ్నాప్ గ్యాంగ్ సభ్యులను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక రివాల్వర్, తపంచా. 40 రౌండ్ల బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కిడ్నాప్ గ్యాంగ్ పట్టివేత
కుత్బుల్లాపూర్: శుక్రవారం ఉదయం కిడ్నాప్‌నకు గురైన యువతిని షేక్ బషీరాబాద్ పోలీసులు రక్షించారు. మెదక్ జిల్లా పటాన్చెరువు వద్ద కిడ్నాప్ గ్యాంగ్‌ను మధ్యాహ్నం 12 గంటలకు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం కొంపల్లి ఉమామహేశ్వరీ కాలనీకి చెందిన రేణుక(19) అనే యువతి శుక్రవారం ఉదయం 10 గంటలకు కిడ్నాప్ అయింది. పది మంది గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి యువతిని కిడ్నాప్ చేశారు. గతంలో యువతితో నిశ్చితార్థం జరిగిన వినోద్ అనే వ్యక్తే కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. వినోద్ కర్ణాటక రాష్ట్రంలో బీదర్ జిల్లాకు చెందిన వ్యక్తి. షేక్‌బషీరాబాద్ సీఐ అల్లం సుభాష్ చంద్రబోస్ పక్కా పథకం ప్రకారం కిడ్నాపైన 2 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. -
కరీంనగర్లో చిన్నారుల కిడ్నాప్ ముఠా పట్టివేత
కరీంనగర్: ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో దొంగలుపడ్డారు. అలాంటి ఇలాంటి దొంగలు కాదు ఏకంగా చిన్నపిల్లలను ఎత్తుకెళ్ళే కెడీలు. ఆరుగురు సభ్యులు గల ముఠా ఆసుపత్రిపై కన్నేసి పిల్లలను ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. ఇద్దరు మహిళలతోపాటు నలుగురు పురుషులు అనుమానాస్పదంగా తిరగడంతో పేషంట్ బంధువులకు అనుమానం వచ్చి నిలదీశారు. దీంతో ముఠా సభ్యులు పారిపోయేందుకు యత్నించగా స్థానికులు ఐదుగురిని పట్టుకుని దేహశుద్ది చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టుబడ్డ వారిని అప్పగించారు. గతంలో ఈ ఆసుపత్రి నుంచి చిన్నపిల్లలను ఎత్తుకెళ్లిన సంఘటనలు ఉన్నాయి. పట్టుబడ్డ ఐదుగురు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాగలక్ష్మి, గరిభీ, కదరి దయానంద్, న్యాదర్ సుమన్, గాదరి మదన్లుగా గుర్తించారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు.