సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎలాంటి అంతర్రాష్ట్ర కిడ్నాపింగ్, దోపిడీ దొంగల ముఠాల సంచారం లేదని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. వీటికి సంబంధించి సోషల్ మీడి యాలో జరుగుతున్న ప్రచారం వదంతి మాత్రమే అన్నారు. ఇలాంటి పుకార్లను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడమే కాదు.. షేర్/ఫార్వర్డ్ చేయడమూ నేరమేనని హెచ్చరించా రు. బుధవారం డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీలు జితేందర్, గోవింద్‌సింగ్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ... ‘సోషల్ మీడియాలో వస్తున్న ఇలాంటి వార్తలు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయడంతోపాటు ప్రతి ఒక్కరినీ అనుమానించే స్థితికి తీసుకెళ్తున్నాయి. అనుమానితులు సరైన సమాధానం చెప్పకపోతే ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు.
ఇలా జరిగిన దాడుల్లో భీమ్‌గల్, బీబీనగర్ ఠాణాల పరిధిలో ఇద్దరు చనిపోవడం బాధాకరం. గ్రామాలతో సహా ప్రతి చోటా నిఘా, సీసీ కెమెరా వ్యవస్థ, కమ్యూనిటీ పోలీసింగ్ విధానాలు పటిష్టం చేసుకున్నాం. ప్రజల సహకారంతో ఎక్కడ నేరం జరిగినా, నేరగాళ్లు సంచరిస్తున్నా తక్షణం పట్టుకుంటాం. సోషల్‌మీడియా వార్తలతో గ్రామాల్లో యువత చేతుల్లో కర్రలు పట్టుకుని గస్తీ కాయడం సరైంది కాదు. ఏదైనా అనుమానం వస్తే ‘100’కు సమాచారమివ్వండి. అర్బన్ ప్రాంతాల్లో గరిష్టంగా 10 నిమిషాలు, రూరల్ ఏరియాల్లో 30 నిమిషాల్లో పోలీసులు వస్తారు.
భీమ్‌గల్, బీబీనగర్ ఘటనలపై కేసులు నమోదు చేశాం. కొందరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాం. సోషల్ మీడియా తిప్పికొట్టడానికి హైదరాబాద్‌తో పాటు కమిషనరేట్లలో ప్రతి పోలీసు స్టేషన్‌కు ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలున్నాయి. జిల్లా స్థాయిల్లోనూ అన్ని ఠాణాలకు వీటిని క్రియేట్ చేసేందుకు, పక్కాగా నిర్వహించేందుకు జిల్లాకో సోషల్‌మీడియా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశాం. భీమ్‌గల్, బీబీనగర్ తరహా ఉదంతాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలిచ్చాం. ప్రజలు హాయిగా నిద్రపోవచ్చు. వారి కోసం మేం కాపలా కాస్తాం’అని మహేందర్‌రెడ్డి వివరించారు.
దొంగల ముఠాల సంచారం వదంతే..
Published Thu, May 24 2018 1:21 AM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment