
సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కిడ్నాప్ గ్యాంగులు, దోపిడీ గ్యాంగుల ప్రచారంపై డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. అలాంటి గ్యాం గులు రాష్ట్రంలోకి రాలేదని, ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగలేదని మంగళవారం స్పష్టంచేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భద్రత కోసం పోలీస్ శాఖ ప్రతీక్షణం పనిచేస్తోందని వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడైనా 100కు కాల్ చేయాలని, దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా ద్వారా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు.