సాక్షి, హైదరాబాద్: కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కిడ్నాప్ గ్యాంగులు, దోపిడీ గ్యాంగుల ప్రచారంపై గురువారం ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్య స్పందించారు. అలాంటి గ్యాంగులు రాష్ట్రంలోకి రాలేదని, ఆ వదంతులు ప్రజలు నమ్మొద్దని తెలిపారు. అలాంటి వాటిని నమ్మి అమాయకులపై దాడి చేయడం మంచిది కాదన్నారు. మతి స్థిమితం లేని వారిపై దాడులకు పాల్పడటం విచారకమన్నారు. ఆ వందతులను నమ్మి ప్రజలు చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం నేరమన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టంచేశారు.
అలాగే.. తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి దీనిపై స్పందించారు. అలాంటి గ్యాం గులు రాష్ట్రంలోకి రాలేదని, ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగలేదని స్పష్టంచేశారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, భద్రత కోసం పోలీస్ శాఖ ప్రతీక్షణం పనిచేస్తోందని వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎప్పుడైనా 100కు కాల్ చేయాలని, దగ్గరలోని పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫేస్‌బుక్, ట్విటర్ తదితర సోషల్ మీడియా ద్వారా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని ఆయన ట్విటర్ ద్వారా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment