కరీంనగర్: ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో దొంగలుపడ్డారు. అలాంటి ఇలాంటి దొంగలు కాదు ఏకంగా చిన్నపిల్లలను ఎత్తుకెళ్ళే కెడీలు. ఆరుగురు సభ్యులు గల ముఠా ఆసుపత్రిపై కన్నేసి పిల్లలను ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. ఇద్దరు మహిళలతోపాటు నలుగురు పురుషులు అనుమానాస్పదంగా తిరగడంతో పేషంట్ బంధువులకు అనుమానం వచ్చి నిలదీశారు.
దీంతో ముఠా సభ్యులు పారిపోయేందుకు యత్నించగా స్థానికులు ఐదుగురిని పట్టుకుని దేహశుద్ది చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టుబడ్డ వారిని అప్పగించారు. గతంలో ఈ ఆసుపత్రి నుంచి చిన్నపిల్లలను ఎత్తుకెళ్లిన సంఘటనలు ఉన్నాయి. పట్టుబడ్డ ఐదుగురు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాగలక్ష్మి, గరిభీ, కదరి దయానంద్, న్యాదర్ సుమన్, గాదరి మదన్లుగా గుర్తించారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు.
కరీంనగర్లో చిన్నారుల కిడ్నాప్ ముఠా పట్టివేత
Published Mon, Sep 30 2013 2:27 PM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
Advertisement
Advertisement