
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వికారాబాద్ : చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే బిహార్ ముఠాలు తిరుగుతున్నాయనే వార్తల నేపథ్యంలో వికరాబాద్‌లో కలకలం రేగింది. బిహార్‌కు చెందిన యువకుడు పాఠశాలల వద్ద తచ్చాడుతూ పట్టుబడడంతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. అతడు చిన్నపిల్లల కిడ్నాప్‌నకు యత్నిస్తున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. బిహార్‌కు చెందిన యువకుడు శనివారం ఓ పాఠశాల ముందు నిలబడి చిన్నారిని పిలిచి చాక్లెట్ ఇస్తానని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో భయపడిన ఆ చిన్నారి జరిగిన విషయం స్కూల్ టీచర్‌కు చెప్పింది. ఈ సమాచారం తెలుసుకున్న స్థానికులు సదరు యువకున్ని వెంబడించి పట్టుకొన్నారు.
పిల్లల్ని కిడ్నాప్ చేసేందుకు యత్నించాడని ఆరోపిస్తూ అతనిపై దాడికి దిగారు. అనంతరం స్థానిక పోలీసులకు అప్పగించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. గత నాలుగు రోజుల నుంచి బిహార్ యువకుడు వికారాబాద్ పట్టణంలో తిరుగుతున్నాడని వెల్లడించారు. ఇతర ప్రాంతాల్లోను బీహార్ ముఠాలు ఉండొచ్చని, చిన్నారుల రక్షణ విషయంలో తల్లిదండ్రులు, స్కూళ్ల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment