సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియా పిల్లలను ఎత్తుకెళ్లే ముఠా సంచరిస్తున్నట్లు వస్తున్న వదంతులకు అమాయకుల ప్రాణాలు బలైతూనే ఉన్నాయి. ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని పాతబస్తీలో ఉద్రిక్తత వాతారణం నెలకొంది. పిల్లలను ఎత్తుకెళ్తున్నారనే నెపంతో స్థానికులు ముగ్గురు హిజ్రాలపై స్థానికులు రాళ్లతో దాడి చేశారు. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని స్థానికులను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపై కూడా దాడులకు దిగారు. పెట్రోలింగ్ వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సివచ్చింది.
అయిదే దాడిలో తీవ్రంగా గాయపడిన ఒకరు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే తీరులో మాదన్నపేటలో సైతం ముగ్గురు బిహార్ వాసులను స్థానికులు చితకబాదారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్సా అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
చంద్రాయణగుట్ట ఘటనా స్థలాన్ని సౌత్‌జోన్ డీజీపీ సత్యనారాయణ పరిశీలించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని, ప్రజలు భయాందోళనకు గురికావోద్దని తెలిపారు. ప్రస్తుతం పాతబస్తీలో ప్రశాంతత నెలకొందని తెలిపారు. మృతిచెందిన హిజ్రాను శంషాబాద్‌కు చెందినది గుర్తించారు. 25 మంది అనుమానితులని అదుపులోకి తీసుకున్నట్లు డీజీపీ తెలిపారు. పోలీసులు ఎంత చెబుతున్నా.. ప్రజల్లో అవగాహాన రావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment