రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే, ఈసారి మరో డిమాండ్‌పై విద్యార్థులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం కమర్షియల్ అగ్రికల్చర్, బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సును తొలగించవద్దంటూ వర్సిటీలో విద్యార్థులు ర్యాలీ తీశారు. కోర్సులను తొలగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. విద్యార్థుల నినాదాలతో వర్సిటీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.