
సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు, పండ్ల తోటలు సాగు చేసే రైతుల ఉత్పత్తులకు సేంద్రియ ధ్రువీకరణ ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధ్రువీకరణ ప్రాధికార సంస్థ (టి.ఎస్.ఎస్.ఒ.సి.ఎ.)కు ‘అపెడా’ నుంచి అనుమతి మంజూరైంది. టి.ఎస్.ఎస్.ఒ.సి.ఎ. సేంద్రియ ధ్రువీకరణ పొందిన రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాలు, సంస్థలు తమ సేంద్రియ ఉత్పత్తులను దేశవిదేశాల్లో విక్రయించుకునేందుకు వీలవుతుంది. సేంద్రియ ధ్రువీకరణ ప్రక్రియ ప్రారంభోత్సవం ఈ నెల 13న హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్(నాంపల్లి)లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఉ. 10.30 గం. నుంచి సాయంత్రం వరకు జరుగుతుందని టి.ఎస్.ఎస్.ఒ.సి.ఎ. డైరెక్టర్ డా. కేశవులు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయదారులు ఈ సమావేశంలో పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment