హైదరాబాద్ : హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్టాండ్‌లో సీసీటీవీ పుటేజీల మాయం కలకలం సృష్టించింది. బస్టాండ్‌లో దొంగలు ఒక బ్యాగ్‌ను ఎత్తుకెళ్లిన కేసు విషయంలో పోలీసులు గురువారం బస్టాండ్‌కు వెళ్లారు. ఆ కేసు విచారణ నిమిత్తం సీసీటీవీ పుటేజీలను పరిశీలించేందుకు ప్రయత్నించారు.
అయితే బస్టాండ్‌లో ఉన్న సీసీటీవీ పుటేజీల బ్యాక్‌అప్లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలు లేకుండా పోవడంతో సుల్తాన్‌బజార్ ఏసీపీ, ఇతర పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. బస్టాండ్‌లో సుమారు 28 కెమెరాలతో భద్రతా కార్యక్రమాలు చేపట్టినా సీసీటీవీ పుటేజీలు లేకపోవడంతో సంబంధిత సిబ్బందిని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా సీసీటీవీ ఏజెన్సీపైన కేసు నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసును ఆఫ్జల్‌గంజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మహాత్మాగాంధీ బస్టాండ్‌లో సీసీటీవీ పుటేజీలు మాయం
Published Thu, May 7 2015 4:06 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement
Advertisement