
నగర దారులన్నీ పల్లె‘టూరు’ దారి పడుతున్నాయ్. బస్సూ, రైలూ, కారూ, బైకూ.. ఏదైనా సరే ఊరికి పోవడమే లక్ష్యం. ఆదివారం సద్దుల బతుకమ్మ, సోమవారం దసరా పండగ కావడంతో శనివారం పట్నవాసులు పల్లెలకు పయనమయ్యారు. సొంతూరిని ఓసారి మనసారా చూసొద్దామని ఆశగా బయలుదేరారు.
నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర బస్టాండ్లు, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. – సాక్షి, స్టాఫ్‌ఫొటోగ్రాఫర్