ఎంజీబీఎస్లో నాలుగు కిలోల బంగారం స్వాధీనం | 4 kgs gold carriers held at Mahatma gandhi bus station in hyderabad | Sakshi
Sakshi News home page

ఎంజీబీఎస్లో నాలుగు కిలోల బంగారం స్వాధీనం

Published Mon, Feb 3 2014 12:56 PM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM

4 kgs gold carriers held at Mahatma gandhi bus station in hyderabad

హైదరాబాద్ : హైదరాబాద్‌ మహాత్మాగాంధీ బస్టాప్‌లో సోమవారం పోలీసుల తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద నాలుగు కిలోల బంగారం ఉన్నట్లు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరు ? నాలుగు కిలోల బంగారం ఎక్కడిది ? అని పోలీసులు విచారిస్తున్నారు.

 మరోవైపు మెదక్‌ జిల్లా జహీరాబాద్‌ ముత్తూట్‌ ఫైనాన్స్‌లో దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. లాకర్లు తెరుచుకోకపోవడంతో వెనుతిరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎంజీబీఎస్లో అదుపులోకి తీసుకున్న వ్యక్తే... జహీరాబాద్‌లో చోరీకి ప్రయత్నించింది కూడా ఒకరేనా అనే కోణంలోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక విశాఖ జిల్లా అరకు యండపల్లివలస కెనరాబ్యాంక్‌లో చోరీకి యత్నం జరిగింది. కాగా ఎంత ప్రయత్నించినా లాకర్లు ఓపెన్‌ కాకపోవడంతో దొంగలు పరారయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement